సెక్షన్ 4(1)(b) ప్రకారంపౌర సమాచార ప్రదర్శించాలని అడిషనల్ కలెక్టర్ గారికి వినతి

ఈ రోజు సమాచార హక్కు చట్టం సంరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి గారికి సమాచార హక్కు చట్టం 2005 నీ మరియు దాని యొక్క విధి విధానాలను ములుగు జిల్లా లోని ప్రతీ ప్రభుత్వ విభాగాలలో అమలుపరచాలని మరియు పౌర సమాచార అదికారుల పేరు వివరాలు తెలిపే సూచికల బోర్డులను, సెక్షన్ 4(1)(b) ప్రకారం స్వచ్చందంగా బహిర్గతం చేరాల్సిన లేదా ఉచితంగా ప్రదర్శించాల్సిన 17 అంశాలను ప్రజలకీ, పౌరులకు తెలిసేవిదంగా, కనపడేవిదంగా 17 అంశాలను ప్రదర్శించాలని అడిషనల్ కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి శేఖర్ అందచేశారు. అదేవిదంగా ములుగు జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ కార్యాలయాలలో వచ్చే RTI act 2005 కి సంబందించిన దరఖాస్తులను, RTI activist లు కోరిన సమాచారాన్ని నిర్ణిత గడువు లోపు అందచేసే విదంగా చర్యలు తీసుకోవాలని కోరారు మరియు నిర్లక్య వైఖరి కల పౌరసమాచారా అధికారుల పట్ల తగిన కఠిన చెర్యలు తీసుకోవాలని శేఖర్ కోరారు.ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అధ్యక్షులు బొజ్జ సిద్దార్థ, ఉపాధ్యక్షులు గోలి దేవేందర్, జిల్లా కమిటీ పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.