సెపక్ తక్రా పోటీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా క్రీడాకారుల ఎంపిక

ఈనెల 12, 13 వ తేదీలలొ గజ్వేల్, సిద్దిపేట జిల్లాలో జరిగిన 8వ అంతర్ జిల్లాల రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ & జూనియర్స్ సెపక్ తక్రా పోటీలలొ ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు తరపున జూనియర్స్ బాలుర విబాగంలొ I.మధు సబ్ జూనియర్స్ బాలికల విబాగంలో J.బ్లెస్సీనా అత్యంత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ మరియు జూనియర్స్ సెపక్ తక్రా పోటీలకు వేదికైన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ పట్టణంలో ఈనెల 27 నుండి 31వ తేది వరకు జరుగు పోటీలకు తెలంగాణ రాష్ట్ర జట్టుకు ఎంపికైనట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సెపక్ తక్రా ప్రధాన కార్యదర్శి K. జితేంద్ర నాథ్ తెలిపారు. ఎంపికైన క్రీడాకారులను సెపక్ తక్రా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి R. శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లా సెపక్ తక్రా సంయుక్త కార్యదర్శి R.వెంకట రామకృష్ణ, ఉపాధ్యక్షులు కాటం రాజిరెడ్డి కార్యనిర్వాహక కార్యదర్శి G.థనరాజ్, కోచ్ రవికుమార్ P.D, కోచ్ G.శ్రీలత P.ET అభినందనలు తెలిపారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.