ప్రైవేట్ హై స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం

దంతాలపల్లి మండలం సెయింట్ మేరీ ప్రైవేట్ హై స్కూల్ లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది. విషయం ఏమిటంటే కెసిఆర్ తలపెట్టిన నెలకు రెండు వేల రూపాయలు 25 కేజీల బియ్యం ఈ స్కీమ్లో మాకు అన్యాయం జరిగింది. ప్రభుత్వం రూల్ ప్రకారం యు డయాస్ లిస్టులో 24 మంది పేర్లు ఉండగా అందులో లో మేనేజ్మెంట్ వాళ్లకు కావలసిన వారి పేర్లు మాత్రమే డి ఈ ఓ ఆఫీస్ కు పంపడం జరిగింది. అందులో ఎనిమిది మంది మాత్రమే మా స్కూల్లో టీచర్ గా వాళ్ళు ప్రకటించుకొని మిగతా టీచర్లకు అన్యాయం చేశారు. ఇదేమిటని అడగగా మా ఇష్టం మీకు పెట్టాం అని మమ్మల్ని బెదిరించారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడం జరిగింది. యు డయాస్ లో లో పేర్లు ఉండికూడా మాకు అన్యాయం జరిగింది డి ఈ ఓ ఆఫీస్ కి ఫోన్ చేస్తే యు యు డయాస్ లో లో మీ పేర్లు ఉంటే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పారు . సార్ లిస్ట్ లో మా పేర్లు ఉన్నాయ్ అని చెప్పగా మీయొక్క యాజమాన్యం ఎనిమిది మంది పేర్లు మాత్రమే చూపించారు. అందుకే వారికి మాత్రమే రావడం జరిగింది కాబట్టి మా తప్పు ఏమీ లేదు. కనుక మీ యాజమాన్య మే ఈ తప్పు చేసిందని చెప్పడం జరిగింది. కాబట్టి మా యొక్క మనవి ఏమనగా తక్షణమే సెయింట్ మేరీ స్కూల్ పై చర్య తీసుకొని అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు ఆర్థిక సహాయాన్ని అందించవలసిందిగా మేము మానవ హక్కుల కమిషన్ను తొర్రూర్ లో కలిసి కలెక్టర్ గారికి మా యొక్క వినతి పత్రం పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు రమేష్ సార్ , లింగమూర్తి సార్, రోజా రాణి మేడమ్, స్వరూప మేడం, పుష్ప మేడం, రమ్య శాంతి మేడం మరియు శైలజ మేడం కలవడం జరిగింది.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.