సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు

ఉచిత కరెంటు ఇవ్వడంతో ప్రతి సెలూన్ షాపు లో కేసీఆర్ గారి పోటో పెట్టుకుని దండం పెట్టుకుంట్టాం
-గుంజపడుగు హరిప్రసాద్

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెలూన్ షాపులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సదుపాయాన్ని కలిగించినందుకు ఈరోజు తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక ఆద్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాబిశేకం జరిపి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 80.000 షాపులకు ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ధి చేకూరుతుందని నెలకు 250 యూనిట్లు కాల్చటం ద్వారా ప్రతి క్షౌరశాలకు దాదాపు 1600/- రూపాయల వరకు ప్రతి నెల లబ్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఈరోజు ప్రతి క్షౌరశాలలో కేసీఆర్ ఫోటో పెట్టుకుని మొక్కుకుంట్టాం అని వారు అన్నారు ఇప్పటికే కరోనా మహమ్మరి వలన నాయీబ్రాహ్మణులు ఆర్థికంగా ఎంతో చితికిపోయారని, గత సంవత్సరకాలం నుండి షాపుల కిరాయిలు మరియు కరెంటు బిల్లులు కట్టలేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఈ నిర్ణయం మా నాయీబ్రాహ్మణ సమాజానికి పెద్ద సంతోషకరమైన నిర్ణయం చేసి జీవో ఇవ్వడం జరిగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి యావత్ నాయీబ్రాహ్మణుల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర కార్యనిర్వాహక అద్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు

కార్యక్రమంలో ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు జంపాల నర్సయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి సింగిరాల వెంకటస్వామి, రాష్ట్ర కార్యదర్శి శావనపల్లి రాజు, జిల్లా నాయకులు మల్లెంకి శ్రీనివాస్, గర్షకుర్తి విద్యాసాగర్, కొత్తగట్టు శ్రీనివాస్, కుర్మిల రాజు, కొత్వల అశోక్, తంగళపల్లి సత్యం, కంది వేంకటేశ్వర్లు, చింతకుంట కనకయ్య తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.