ఎవరైన శరణాలయం కు సహాయం చేయాలనుకుంటే గూగుల్ ఫే, ఫోన్ ఫే నం:-9441 786 713,(శ్రీదేవి గజ్జెల్లి-సేవాజ్యోతి) మంచిర్యాల జిల్లా” //తాండూర్// మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం లో.! కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా” తిర్యాని మండల కేంద్ర వాస్తవ్యులు గుండం రారాజు హేమ దంపతుల కూతురు చి”రష్మిక రెండవ పుట్టినరోజు వేడుకలు సేవా జ్యోతిలో ఘనంగా జరుపుకున్నారు, అనంతరం శరణాలయం కు బియ్యం పండ్లు పంపిణీ చేసారు, వారు మాట్లాడుతూ ఇలాంటి దీనులకు నిరాశ్రయులైన వారిని ఆదరించి మనదైన ధర్మం కోసం నిరంతరం సేవలు చేస్తూ వస్తున్న ఈ సేవా జ్యోతి శరణాలయం దంపతులకు మా అభివందనాలు అని అన్నారు.! శరణాలయం నిర్వాహకులు మాట్లాడుతూ సమాజంలో మార్పు రావాలని, దీనులైన వారికి చేయూత నిచ్చి ఆదరించాలని కోరారు, ఎవరైనా సరే అభాగ్యులకు సహాయం చేయాలనుకుంటే గూగుల్ ఫే ఫోన్ ఫే నం శ్రీదేవి గజ్జెల్లి 9441 786 713 కి అందజేసిన మీరు ఈ సేవా యజ్ఞం లో పాల్గొన్న వారౌతారు అని పేర్కొన్నారు.! ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్, సేవిక ప్రముఖ్ శరణాలయం నిర్వాహకులు శ్రీదేవి, స్వప్న, లక్ష్మీ,బద్ది మహేష్, శేఖర్, కుటుంబ సభ్యులు, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *