పార్టీని పణంగా పెట్టి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన తల్లీ సోనియా గాంధీ
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోనియా గాంధీ గారి పుట్టిన రోజు సందర్భంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ
పేదలు, బడుగు బలహీనవర్గాలకు అభ్యున్నతి కోసం పాటు పడిన నేత సోనియా గాంధీ గారు అని రాదనుకున్న తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రం విడిపోతే ఏపీలో పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన గొప్ప వ్యక్తి సోనియా గాంధీ అని సీతక్క గారు కొనియాడారు వెనుకబడ్డ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారితే అభివృద్ది చెందుతుందని భావించి ప్రత్యేక తెలంగాణను ఇచ్చిందని వివరించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో పేదలను రాష్ట్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
సోనియాకు పదవుల మీద ప్రేమ లేదన్నారు. 2004, 2009లో ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్న వారు అవ్వకుండా, రాహుల్ గాంధీకి అప్పగించకుండా పార్టీ విధేయుడైన మన్మోహన్ సింగ్కు ఇచ్చారని వివరించారు. ఎప్పుడు గాంధీ కుటుంబం పదవుల గురించి కాకుండా పేదవారి అభివృద్ధి కోసం ఆలోచించారని తెలిపారు.
నూతన రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి అని చెప్పిన కేసీఆర్ వాటి అమలులో విఫలమయ్యారని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు వస్తాయి. నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు వస్తాయని ఆశిస్తే నిరాశగానే మిగిలిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క పేదవాడి ఇళ్లు నిర్మాణానికి సహకరించిందని వివరించారు. ఆరేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం పేదవాడి గూడు గురించి పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందనుకుంటే కేసీఆర్ కుటుంబం బంగారు కుటుంబంగా మారుతుందని దుయ్యబట్టారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, మండల అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా, చెన్నొజూ సూర్యనారాయణ, సహకార సంఘం చైర్మన్ బొక్క సత్తి రెడ్డి,
వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్,మాజీ సహకార సంఘం చైర్మన్ కునూరి అశోక్ గౌడ్,మాజీ సర్పంచ్ ముశినపెళ్ళి కుమార్ గౌడ్
సుధాకర్ రావు,కుక్కల నాగరాజు
తదితరులు పాల్గొన్నారు

complete post