సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఇచ్చిన Ed నోటీసు లు వెనక్కి తీసుకోవాలి

రాజ్ భవన్ కు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తల పై దాడులు కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
మోడీ కి Ed కి భయపడేది లేదు
బీజేపి కుటిల రాజకీయాల మీద పోరాటం ఉదృతం చేస్తాం
దేశంలో మోదీ నయా బ్రిటీష్ పాలన
అక్రమ కేసులకు భయపడేది లేదు
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు
ఈ రోజు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాట్లాడుతూ
శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఇచ్చిన Ed నోటీసు లను వెనక్కి తీసుకోవాలి కోరుతూ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శాంతియుతంగా రాజ్ భవన్ కు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులను కార్యకర్తలను అడ్డుకొని లాటి చార్జి చేసి అక్రమ కేసులు పెట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని
ఆడబిడ్డలు అని కూడా చూడకుండా మహిళ నాయకుల పట్ల దురుసుగా ప్రవర్తించారు బిజెపికి వత్తాసుగా కేసీఆర్ ప్రభుత్వం మా శ్రేణులు పైకి ఖాకీలను ఉసికొల్పింది, అయినా పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో దేశంలో నియంత పాలన అంతానికి కాంగ్రెస్ కదం తొక్కుతోందిమా కార్యకర్తలు నాయకులపై లాంటి ఛార్జీలను అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నాను అని
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఎనిమిదేళ్ల పాలన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీనే కలలోకి వస్తున్నట్టుందని, అందుకే కాంగ్రెస్ పార్టీ మీద
కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క బీజేపి పై మండిపడ్డారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చిన ప్రైవేటు ఫిర్యాదు పై నమోదు చేసిన కేసును ఎనిమిదేళ్లుగా సాగతీస్తూ, తాజాగా శ్రీమతి సోనియాగాంధీ, శ్రీ రాహుల్ గాంధీలకు ఈడీ ద్వారా నోటీసులు ఇప్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సీతక్క గారు అన్నారు
బీజేపీది, బ్రిటీషువారిది ఒక్కటే భావజాలమని, నాడు వారి అణచివేత, దౌర్జన్యానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాడిందని రేవంత్ గుర్తు చేసారు. ఇప్పుడు వారి భావజాలానికి వారసులైన బీజేపీ – మోదీ అణచివేత, కుట్రలకు వ్యతిరేకంగా అంతే ఉత్తేజంతో పోరాడుతుందని ధీమా వ్యక్తం చేసారు. నాటి స్వాతంత్ర్య సంగ్రామానికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ నేడు మోదీని గద్దె దింపే ఉద్యమానికి నాయకత్వం వహిస్తుందని, తాజాగా ఈడీ నోటీసులు కాంగ్రెస్ అగ్రనాయకత్వ మనోధైర్యాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవన్నారు
ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెళ్లి రాజేందర్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి,మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,సర్పంచ్ అల్లేం సదానందం,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,మాజీ సహకార సంఘం చైర్మన్ రావుల రాజేశ్వర్ రావు,తోట భద్రయ్య,పటేటి కొండల్ రెడ్డి
మైనార్టీ సెల్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆజ్జు,ప్రసాద్, చంద్
కొమురయ్య,రాజయ్య,సాంబయ్య,రాజు,ప్రభాకర్,రాజేందర్
తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.