ఈ69 వార్త జఫర్ఘడ్ ఏప్రిల్1
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూనూర్ విద్యార్థినీ విద్యార్థులకు మా ఇల్లు ఆశ్రమం జఫర్గడ్ వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి పదవ తరగతి చదువుతున్న 63 మంది విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యార్థులను ఉద్దేశించి స్ఫూర్తిదాయక విషయాలను వివరించారు.పదవ తరగతిలో మంచి గ్రేడింగ్ సాధించే విధంగా విద్యార్థులకు మెలకువలు నేర్పించారు.ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు,అనాధ పిల్లలకి స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్లు తెలియజేశారు.ఈ విద్యా సంవత్సరం కూనూర్ పాఠశాలలోని అందరు విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇచ్చినట్లు తెలిపారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ మాఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి విద్యార్థుల కోసం ఇంత విలువైన స్టడీ మెటీరియల్ ను అందజేయటం అభినందనీయమని కొనియాడారు.వారి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్యార్థులందరూ స్టడీ మెటీరియల్ ను సక్రమంగా ఉపాధ్యాయుల సహాయంతో వినియోగించి మంచి మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు,మా ఇల్లు ఆశ్రమం సిబ్బంది పాల్గొన్నారు.
