పట్టించుకోని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు స్టేషన్ ఘనపూర్ మార్చ్ 25 E69 న్యూస్: స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని గాంధీ పొంగి పొర్లుతున్న డ్రైనేజిచౌరస్తా నుండి రైల్వే గేట్ వద్దకు వెళ్ళే దారుల్లో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజి పనులు నత్తనడకన చేస్తున్నారు. అదేవిధంగా కొన్ని షాపుల ముందు నిర్మిచ్చి వదిలివేయదంతో మోరీల నుండీ డ్రైనేజి నేరుగా రోడ్డు మీదకు పొంగిపొర్లుతున్నాయు.గత కొంతకాలంగా డ్రైనేజి పొంగిపోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజి పొంగిపోరుతున్న సమయంలో మురుగునీరు పక్కనే ఉన్న ఇండ్ల ముందు ఆగడం తో దుర్వాసన వేదజల్లుతుంది.దీనితో దోమలు,ఈగలు వృద్ధి చెంది పక్కనే ఉన్న పరిసరాల ప్రజలకి అనేకమైన రోగాల బారిన పడుతున్న సంబంధించిన అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటి కేన ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు తక్షణమే పొంగిపోరుతున్న డ్రైనేజి సమస్య ను శాశ్వతంగా పరిష్కారం చేయాలని పట్టణ వసూలు కోరుకుంటున్నారు