75 సంవత్సరాల స్వతంత్ర భారతిలో జాతీయ జెండాలు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఎగరవేయడం సమంజసం కాదని స్వదేశీ వస్తువులు వాడాలి విదేశీ వస్తువులు బహిష్కరించాలని మనదేశంలో ఉత్పత్తి చేసుకొని ఉత్పత్తి చేయబడినటువంటి వాటిని ప్రోత్సహించాలని విశ్వమానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అమీర్పేట్ హైదరాబాద్ మైత్రివనం నుండి ఆర్ఎస్ బ్రదర్స్ మీదుగా ర్యాలీ నిర్వహించడం జరిగింది మన దేశంలో యువతకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చి పనులు కల్పించి వ్యవసాయ రంగాన్ని పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుచుకుంటేనే అభివృద్ధి జరుగుతుందని దేశభక్తి ముసుగులో దేశాన్ని విదేశాలకు సామ్రాజ్యవాద దేశాలకు తాకట్టు పెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మస్తాన్ రావు గారు, లొంక సంపత్ ,కే యాదగిరి ,పాపారావు ,కృష్ణ తదితరులు పాల్గొన్నారు.