నాణ్యమైన క్రీడా పరికరాలు విక్రయించి పేరు తెచ్చుకోవాలి .

ప్రభుత్వం స్వయం ఉపాధికి చేయూత నిస్తుంది .

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు .

యువత స్వయం ఉపాధి మార్గాలతో ఆర్థికంగా ఎదగాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలో కృపాధార స్పోర్ట్స్ అండ్ గిఫ్ట్ ఆర్టికల్స్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ….. యువత స్వయం ఉపాధితో ఎదగడానికి ప్రభుత్వం బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు అందజేస్తుంది అన్నారు. యువత ఉపాధి మార్గాల కోసం ప్రభుత్వం వృత్తిపరమైన నైపుణ్యాలను పెంచుకునేందుకు అనేక రకాల శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. శిక్షణ పొందిన యువకులు స్వయం ఉపాధి మార్గాలను ఏర్పాటు చేసుకుని మరో కొంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు అన్నారు. కోదాడ పట్టణంలో అన్ని రకాల వ్యాపారాలు ఏర్పాటు కావడం పట్టణ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. క్రీడాకారులకు నాణ్యమైన పరికరాలు అందజేసి కృపాదార స్పోర్ట్స్ మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. శారీరక దృఢత్వానికి, వ్యాయామం ఎంతో అవసరమని క్రీడా పరికరాలతో క్రీడలను సాధన చేసి శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం పొందాలన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి, టిఆర్ఎస్ నాయకులు ఒంటిపులి నాగరాజు,లక్ష్మీ నారాయణ,కౌన్సిలర్ మెదర లలిత, ఈదుల క్రిష్ణయ్య,రాయపూడి వెంకట నారాయణ, kln ప్రసాద్,గంధం పాండు,పంది తిరపయ్య,ఖాజా,పాస్టర్ యేసయ్య,శకరయ్య,బత్తుల ఉపేందర్,రాజు, నాని వంశీ, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.