స్వయం ఉపాధి మార్గాలతో యువత ఆర్థికంగా అభివృద్ధి చెందాలి.

నాణ్యమైన వస్త్రాల అమ్మకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలి .

వ్యాపార వర్గాలకు ప్రభుత్వ పక్షాన సహకారం అందిస్తాం

ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు

స్వయం ఉపాధి మార్గాలతో యువత ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం కోదాడ పట్టణంలోని భవాని శారీ సెంటర్ ను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ….. కోదాడ పట్టణం అన్ని రకాల వ్యాపారాలతో దినదిన అభివృద్ధి జరుగుతుందన్నారు. అనుబంధ వ్యాపారాలు అభివృద్ధికి దోహదపడతాయి అన్నారు. వ్యాపారాలలో అభివృద్ధి చేసుకొని మరికొంత మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. నాణ్యమైన వస్త్రాలు అమ్మకాలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. వ్యాపార వర్గాలకు ప్రభుత్వ పక్షాన పూర్తి సహకారం అందిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సుధారాణి పుల్లారెడ్డి ఎంపీపీ కవితా రాధా రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంపటి పద్మ మధుసూదన్, టౌన్ పార్టీ అధ్యక్షులు నాగేశ్వరరావు, పట్టణ కౌన్సిలర్లు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.