జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం

నల్గొండ: ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజుద్దీన్ అకాల మరణానికి సంతాప సూచకంగా ఈరోజు అసోసియేషన్ నల్గొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో క్లాక్ టవర్ సెంటర్లో సంతాప సభ నిర్వహించారు. స్వర్గీయ రియాజుద్దీన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ప్రింట్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ స్వర్గీయ రియాజుద్దీన్ జర్నలిస్ట్ యుద్ధ నౌక అని చిన్న పత్రికల సంక్షేమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన నిరంతర శ్రామికుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి జి జయశంకర్, సిటీ కేబుల్ ఎండి దుర్గాప్రసాద్, ప్రింట్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్, మసూద్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిట్టల రామకృష్ణ జర్నలిస్టులు గులాం సుభాని, షౌకత్ అలీ, చారి, పల్లె నవీన్, ఆర్.వెంకట్ రెడ్డి, నాగరాజు, వీర్రాజు, ఖుద్దూస్, సయ్యద్, శ్రీధర్, నజీర్ రాధాకిషన్ లెనిన్ వినోద్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.