స్వాతంత్య్రోద్యమంలో కమ్యూనిస్టుల త్యాగాలు , ఆరెస్సెస్ ద్రోహాలు
 1. భారత స్వాతంత్రోద్యమం మన దేశ చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టం . ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితం . అశేష ప్రజానీకం కుల , మత , భాషా , ప్రాంతీయ విభేదాలను అధిగమించి ఐక్యంగా పాల్గొన్నారు . ఆ ఉద్యమంలో ప్రధాన నాయకత్వ పాత్ర కాంగ్రెస్ పోషించింది . అదే సమయంలో కమ్యూనిస్టులు అమోఘమైన పాత్ర పోషించారు . అటు కాంగ్రెస్ , ఇటు కమ్యూనిస్టులు జాతీయోద్యమంలో తమ పాత్ర గురించి అధికారికంగా డాక్యుమెంటేషన్ చేశాయి . కాని తమదే నిజమైన దేశభక్తి అని ప్రచారం చేసుకునే ఆరెస్సెస్ గాని , మరే ఇతర హిందూత్వ సంస్థ గాని అటువంటి డాక్యుమెంటేషన్ చేయగలిగాయా ? లేదు . ఎందుకు ? జాతీయోద్యమంలో వారికి చెప్పుకోదగినటువంటి పాత్ర అంటూ ఏమీ లేదు సరికదా , ఆ ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి బ్రిటిష్ వలస పాలకులతో చేయి కలిపి కుమ్మక్కైన నీచమైన పాత్ర మాత్రమే ఉంది . నేడు 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాలు జరుగుతున్నాయి . అవి జరిగే సమయంలో ఆనాడు విద్రోహపూరిత పాత్ర పోషించిన హిందూత్వ శక్తులే కేంద్రంలో అధికారంలో ఉండడం దేశం ముందున్న అత్యంత విషాద ఘట్టం . ముందుగా కమ్యూనిస్టుల పాత్ర గురించి :

2.1921 లో భారత కమ్యూనిస్టు పార్టీ మొదటి శాఖ ఏర్పడింది . భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చేయడం తక్షణ లక్ష్యంగా నిర్ణయించుకుంది . 1921 లో అహమ్మదాబాద్ లో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహాసభకు ” సంపూర్ణ స్వరాజ్యం సాధన ” తీర్మానాన్ని పంపింది . అంతవరకూ జాతీయోద్యమ లక్ష్యం అస్పష్టంగానే ఉంది . గాంధీ సైతం తన ‘ స్వరాజ్య ‘ లక్ష్యం ఏమిటో స్పష్టం చేయలేదు . కాని కమ్యూనిస్టు పార్టీ
( 1 ) బ్రిటిష్ పాలన నుండి విముక్తి సాధించడం ,
( 2 ) కార్మిక , కర్షక వర్గాలు , ఇతర తరగతుల శ్రమజీవుల విముక్తి సాధించడానికి ఉత్పత్తి సాధనాలను ప్రభుత్వ లేదా సామాజిక నియంత్రణలోకి తేవడం
( 3 ) కులతత్వం , మతతత్వం , ఇతర విచ్ఛిన్నకర ధోరణులను ఓడించి విస్తృత ప్రజానీకాన్ని ఐక్యం చేయడం అనే మూడు లక్ష్యాల సారాంశమే సంపూర్ణ స్వాతంత్య్రం అని స్పష్టంగా ప్రకటించింది . 1929 లో ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం స్వాతంత్ర్యోద్యమ నినాదంగా మారిందంటే దానికి కమ్యూనిస్టులు పోషించిన పాత్ర కారణం .

 1. అసంఖ్యాకంగా ఉన్న కార్మికులను , రైతులను , యువజనులను , విద్యార్ధులను , మహిళలను సంఘాలలోకి సమీకరించి వారిని జాతీయోద్యమంలో భాగస్వాముల్ని చేసింది కమ్యూనిస్టులే . 1920 నుండి ఎఐటియుసి , 1936 నుండి కిసాన్ సభ , యువజన సంఘం , విద్యార్థి సంఘం , మహిళా సంఘం , అభ్యుదయ రచయితల సంఘం , ప్రజా కళాకారుల సంఘం నిర్మించి , వాటి నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించింది కమ్యూనిస్టులు . అదే సమయంలో వాటిని విశాల ప్రాతిపదికన నడిపి లక్షలాదిమందిని సంఘాలవైపు , తద్వారా జాతీయోద్యమం వైపు ఆకర్షించారు . అంతవరకూ కొద్దిమంది మధ్య , ఉన్నత తరగతుల మేధావుల ఉద్యమంగా నడిచిన జాతీయోద్యమం కమ్యూనిస్టుల ప్రవేశంతో నిజమైన ప్రజా ఉద్యమంగా మలచబడింది . తొలుత విడివిడిగా వ్యవహరించిన వివిధ తీవ్రవాద సంస్థలు ( భగత్‌సింగ్ నౌజవాన్ యువజన సభ వంటివి ) అన్నీ కమ్యూనిస్టుల చొరవతోనే జాతీయోద్యమంలో భాగస్వాములయ్యాయి . ” బాంబు రాజకీయాలా ? అహింసా రాజకీయాలా ? ” అన్న చర్చనుండి మళ్ళించి అందరినీ ఏకోన్ముఖంగా జాతీయోద్యమం వైపు నడిపించింది కమ్యూనిస్టులే .
 2. నిర్బంధాలు , కేసులు : కమ్యూనిస్టులు మొదటినుండీ బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కోవలసివచ్చింది . లో పెషావర్ కుట్ర కేసు , 1923 లో కాన్పూర్ కుట్ర కేసు బనాయించారు .
  1928 లో కమ్యూనిస్టులు చురుకుగా పాత్ర పోషిస్తున్న వర్కర్స్ అండ్ పెజెంట్స్ పార్టీని నిషేధించింది బ్రిటిష్ ప్రభుత్వం .
  1929 లో మీరట్ కుట్ర కేసు బనాయించారు . ఈ కేసు విచారణను ఉపయోగించి స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాలను ప్రజల్లో ప్రచారం చేయగలిగారు కమ్యూనిస్టులు . దేశంలో , అంతర్జాతీయంగా కూడా నిందితులకు గొప్ప మద్దత్తు లభించింది . వారిని విడుదల చేయాలన్న ఉద్యమం నడిచింది . దాంతో ముందు 20 సంవత్సరాల పాటు శిక్ష విధించిన ప్రభుత్వం దిగి వచ్చి 1933 లో అందరినీ విడుదల చేయక తప్పలేదు . ఈ సమయంలోనే లాహెూర్ కుట్ర కేసులో భగత్‌సింగ్ , అతని సహచరులు విచారణను ఎదుర్కొని ఉరితీయబడ్డారు . ఒకవైపు నిర్బంధాలను ఎదుర్కొంటూనే 1928 నుండీ ముంచుకొచ్చిన మహామాంద్యం భారాల నుండి కష్టజీవులను కాపాడడానికి కమ్యూనిస్టులు ఎన్నో ఉద్యమాలు నిర్మించారు . ఒక్క 1928-29లోనే 203 సమ్మెలు జరిగాయి .
  3 కోట్లకు పైగా పని దినాలు ఆ సమ్మెల వలన యజమానులు నష్టపోయారు .
 3. ఉధృతమైన ప్రజా పోరాటాలు ఒకవైపు , ప్రజల్లో విస్తృతంగా సోషలిస్టు భావాల ప్రచారం ఇంకోవైపు ఈ కాలంలో కమ్యూనిస్టులు చేపట్టారు . కాంగ్రెస్ సోషలిస్టు పార్టీలో చేరి ఆవేదికను ఈ కార్యకలాపాలకు ఉపయోగించుకున్నారు . కాంగ్రెస్ సోసలిస్టు పార్టీతో , సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో ఐక్య కార్యాచరణ నడిపారు .
 4. దళితులు , గిరిజనులు , మహిళలు ఉద్యమాలవైపు రాకుండా వారిని అడ్డుకుంటున్న సాంఘిక దురాచారాలకు ( అంటరానితనం , పురుషాధిక్యత , మూఢవిశ్వాసాలు , అవిద్య వగైరా ) వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఈ కాలంలోనే సంస్కరణోద్యమాలు చేపట్టారు . మహారాష్ట్రలో రణదివే , ఆర్పి మోరే , కేరళలో క్రిష్ణ పిళ్ళై , ఎకె గోపాలన్ , ఇఎంఎస్ నంబూద్రిపాద్ , తమిళనాడులో పి.రామ్మూర్తి , తెలుగునాట సుందరయ్య , బసవపున్నయ్య వంటినాయకులు ఈ ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు .
 5. రెండో ప్రపంచ యుద్ధం 1939-45 : బ్రిటిష్ ప్రభుత్వం విధించిన యుద్ధభారాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున సమ్మెలు నడిపారు . అదే సమయంలో హిందూ మహాసభ , ముస్లింలీగ్ బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలిపాయి . 1941 లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించింది . అప్పట్లో ప్రభుత్వం నిర్బంధించిన 700 మందిలో 400 మంది కమ్యూనిస్టులే . 1941 లో ముంచుకొచ్చిన ఫాసిస్టు ప్రమాదాన్ని గుర్తించిన కమ్యూనిస్టు పార్టీ ఫాసిస్టు శక్తులను ఓడించడానికి అవసరమైన వైఖరి చేపట్టింది . కాని కాంగ్రెస్ , ఫార్వర్డ్ బ్లాక్ వైఖరులు వేరుగా ఉన్నాయి . ఫాసిజం ప్రమాదం గురించి ప్రజానీకాన్ని పెద్ద ఎత్తున చైతన్యపరిచింది కమ్యూనిస్టులు . ఈ కాలంలో కమ్యూనిస్టులు బ్రిటిష్ ప్రభుత్వంతో లాలూచీ పడ్డారన్న ప్రచారాన్ని ఆతర్వాత కాలంలో కాంగ్రెస్ చేపట్టింది . కాని ఆకాలంలో బ్రిటిష్ ప్రభుత్వ రహస్య నివేదికలు మాత్రం ” కమ్యూనిస్టుల బ్రిటిష్ ప్రభుత్వ వ్యతిరేక వైఖరిలో మాత్రం ఎటువంటి మార్పులేదని స్పష్టంగా వెల్లడించాయి .
 6. 1943 కరువు : దేశాన్ని భయంకరమైన కరువు 1943 లో పట్టి పీడించింది . దేశం జనాభా ముఫ్ఫై కోట్లమందిలో కరువుబారిన కనీసం 12.5 కోట్లమంది పడ్డారని నివేదికలు తెలుపుతున్నాయి . దానికి తోడు ప్లేగు , మలేరియా వంటి అంటువ్యాధులు విస్తరించాయి . ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూశారు . బ్రిటిష్ ప్రభుత్వం యుద్ధం పేరుతో భారాలు మోపిందే తప్ప ప్రజలను ఆదుకోలేదు . ఆ సమయంలో ప్రజానీకానికి అండగా నిలిచింది కమ్యూనిస్టులు . ఈ కాలంలోనే మలబార్ ప్రాంతంలో ఆహారధాన్యాలను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా అడ్డుపడిన యువ కమ్యూనిస్టులు – మదత్తిల్ అప్పు , కన్హంబు నాయర్ , చిరుకందన్ , అబూ బకర్- అనే నలుగురిని 1943 మార్చి 29 న మలబార్ ప్రభుత్వం ఉరి తీసింది .
 7. సంస్థానాలలో ఉద్యమాలు , భాషాప్రయుక్త రాష్ట్రాలు : ఆయా సంస్థానాలలో పాలిస్తున్న ఫ్యూడల్ ప్రభువుల దుర్భర పీడనకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్మించింది కమ్యూనిస్టులు . కాంగ్రెస్ పార్టీ మాత్రం సంస్థానాధీశులకు అనుకూలంగా వ్యవహరించింది .
  ( ఎ ) వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం : భూసమస్యను రంగం మీదకు తెచ్చింది . విశాలాంధ్రలో ప్రజారాజ్యం నినాదంతో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఎజండా ముందుకొచ్చింది .
  ( బి ) తెభాగా : 1946 నవంబర్ నుండి 1947 ఫిబ్రవరి మధ్య బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా సాగిన ఈకౌలురైతుల హక్కుల పోరాటంలో 70 మంది కాల్పుల్లో మరణించారు . రైతాంగ సమస్యలను ముందుకు తేవడంతో బాటు అంతకు ముందే నవఖలీ లో హిందూత్వ శక్తుల ప్రమేయంతో జరిగిన హిందూ ముస్లిం మత ఘర్షణల వైపు నుండి వర్గ పోరాటం వైపు ప్రజానీకం దృష్టిని మరల్చగలిగింది .
  ( సి ) పున్నప్ర వయిలార్ : అలెప్పీ జిల్లా ( కేరళ ) లో రెండు గ్రామాలు పున్నప , వయిలార్ . ఆ ప్రాంతంలో నిత్యావసరాల ధరలు తగ్గించాలని ఆందోళనకు కమ్యూనిస్టులు పిలుపునిచ్చారు . తిరువాన్కూర్ సంస్థాన ప్రభుత్వం సైనికపాలన విధించి అణచివేతకు పూనుకుంది . అక్కడి ప్రజలు నిర్బంధాన్ని వీరోచితంగా , చేతికి దొరికిన ఆయుధాలతో ప్రతిఘటించారు . చివరికి భారతదేశంలో విలీనం చేయడానికి అంతవరకూ వ్యతిరేకంగా ఉన్న రాజు దిగివచ్చి విలీనానికి అంగీకరించాడు .
  ( డి ) మలబార్ : ఈ ప్రాంతంలో ఆకలి , కరువు తాండవిస్తున్నప్పుడు పెద్దఎత్తున రైతాంగ పోరాటాలను నిర్వహించింది . కమ్యూనిస్టు పార్టీ . ఆహారధాన్యాలను బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా అడ్డుపడిన యువ కమ్యూనిస్టులు – మదత్తిల్ అప్పు , కన్హంబు నాయర్ , చిరుకందన్ , అబూ బకర్- అనే నలుగురిని మలబార్ ప్రభుత్వం ఉరి తీసింది
  ( 1943 మార్చి 29 న ) . కయ్యూర్ అమరవీరులు అని వీరిని తలుచుకుంటాం . వీరినే గాక కాల్పులు జరిపి అనేకుల ప్రాణాలను బలిగొన్నారు . వందలాదిమందిని సేలం జైలుకు పంపి నానా యాతనలూ పెట్టారు . జైల్లో సౌకర్యాలకోసం పోరాడిన కమ్యూనిస్టులపై కాల్పులు జరిపి 20 మందిని బలిగొన్నారు .
  ( ఇ ) వర్లీ ఆదివాసుల పోరాటం వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలోని వర్లీ గిరిజనులు ఉద్యమించారు . నిర్బంధాలను కాల్పులను తట్టుకున్నారు . నెలరోజులపాటు సమ్మె జరిగింది . చివరకు విజయం గిరిజనలుదే అయింది . ఈ ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులే .
  ( ఎఫ్ ) త్రిపుర గిరిజన సాయుధ పోరాటం : భారతదేశంలో విలీనానికి అంగీకరించలేదు త్రిపుర రాజు . తీవ్రమైన ప్రజావ్యతిరేకత అతనిపై గూడుకట్టుకుని వుంది . అక్కడి గిరిజనులను సంఘటితం చేసి గ్రామాల్లో సాయుధ గెరిల్లా ప్రతిఘటన దళాలను నిర్మించి ప్రజాపాలన నెలకొల్పింది కమ్యూనిస్టులే . ఆ దెబ్బకి దిగివచ్చి భారతదేశంలో త్రిపురను విలీనం చేశారు .
  ( జి ) సుర్మా లోయ రైతాంగ పోరాటం : అసోం ప్రాంతంలో కౌలు రైతులను సంఘటితపరిచి హక్కులకోసం సాగించిన పోరాటం పై పోరాటాల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రతికూల వైఖరినే తీసుకుంది తప్ప ప్రజల పక్షాన నిలవలేదు . కమ్యూనిస్టులు నిర్వహించిన పాత్ర వలన ఆ సంస్థానాల ప్రజానీకం స్వాతంత్ర్యోద్యమంలో అంతర్భాగం అవడమే కాకుండా , ఆ ప్రాంతాల ప్రభువులు అనివార్యంగా తమ సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి అంగీకరించాల్సి వచ్చిం ది .
 8. నావికాదళ తిరుగుబాటు : 1946 ఫిబ్రవరి 18 న బొంబాయిలో నావికులు తిరుగుబాటు ప్రకటించారు . కాంగ్రెస్ , ముస్లింలీగ్ , కమ్యూనిస్ట్ జెండాలు ఎగురవేశారు . యూనియన్ జాకన్ను దించివేశారు . 19 న కరాచీలో తిరుగుబాటు ప్రకటించారు . ప్రభుత్వం నౌకలను సొంతం పేల్చివేస్తామని హెచ్చరించింది . దాంతో తిరుగుబాటు మద్రాన్ , విశాఖ , కలకత్తా , కొచ్చిన్ , జామ్‌నగర్ , అండమాన్లకు విస్తరించింది . మొత్తం సముద్రంలో ఉన్న 78 నౌకలలో , తీరాన ఉన్న 28 నౌకలలో నావికులు తిరుగుబాటు ప్రకటించారు . వీరికి మద్దత్తుగా కమ్యూనిస్టులు దేశవ్యాప్త సమ్మె ఫిబ్రవరి 22 న ప్రకటించారు . ఇంకోపక్క పూనా , జబల్పూర్ , జెస్సోర్ , అంబాలా , కొలాబా కంటోన్మెంట్లలోని మిలిటరీ కూడా తమ మద్దత్తు ప్రకటించారు . బొంబాయిలోని కార్మికులు , ప్రజలు సంఘీభావం ప్రకటించారు . ఇదొక దేశవ్యాప్త తిరుగుబాటుగా మారే వాతావరణం వచ్చింది . ఈ తిరుగుబాటును బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత దారుణంగా అణచివేసింది .
  3 రోజుల్లో 250 మందిని కాల్పుల్లో పొట్టనబెట్టుకుంది . కాంగ్రెస్ , ముస్లిం లీగ్ ఈ తిరుగుబాటును వ్యతిరేకించాయి . కాల్పులను ఖండించలేదు సరికదా ప్రజలనే తప్పుబట్టాయి .
 9. యుద్ధానంతర ఉద్యమాలు యుద్ధానంతర కాలంలో ప్రజల పరిస్థితులు మరింత దిగజారిపోయాయి . యుద్ధసమయంలో నియమించబడిన వారిలో 50 నుండి 70 లక్షల మంది కార్మికులను తొలగించారు . ధరలు 15 శాతం ఒక్క సంవత్సరంలోనే పెరిగాయి . ఈ భారాలకు వ్యతిరేకంగా 1946 లో 1629 సమ్మెలు జరిగాయి . రైల్వే , పోస్టల్ , ఓడరేవులు , బొగ్గుగనుల కార్మికులు సమ్మెలు చేశారు . తిరువాన్కూర్ , హైదరాబాద్ , మైసూర్ , ఇండోర్ వంటి సంస్థానాల్లో సమ్మెలు జరిగాయి . కాంగ్రెస్ పాలిత ప్రావిన్షియల్ ప్రభుత్వాలు సమ్మెలకు వ్యతిరేక వైఖరిని తీసుకున్నాయి . సమ్మెలను నీరుగార్చే ఐడి యాక్ట్ ఈ కాలంలోనే తెచ్చారు . అంతేగాక కార్మికోద్యమాన్ని చీల్చి ఐఎన్టియుసి ని ఏర్పాటు చేసింది కూడా ఈ సంవత్సరమే .
 10. మొత్తంగా చూస్తే భారతదేశంలో కష్టజీవుల రాజ్యాన్ని స్థాపించడానికి తొలిమెట్టుగా స్వాతంత్ర్యోద్యమాన్ని పరిగణించారు కమ్యూనిస్టులు , సామ్రాజ్యవాదుల పీడనతో బాటు ఫ్యూడల్ ప్రభువుల పాలనను , భూస్వామ్యవ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతో పని చేశారు . కష్టజీవులను కుల , మత , ప్రాంతీయ , భాషా భేదాలకు అతీతంగా ఐక్యపరిచారు . స్వాతంత్ర్యోద్యమానికి ప్రజాపునాదిని కల్పించారు . సంపూర్ణ స్వాతంత్య్రం అనే లక్ష్యాన్ని ముందుంచారు . ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాన్ని అందించారు . అశేష త్యాగాలతో , అమోఘమైన సేవలతో ఆదర్శనీయమైన కృషి చేశారు . నిజమైన దేశభక్తి ఏ విధంగా ఉంటుందో ఆచరణలో చూపించారు .
 11. కమ్యూనిస్టులు సోవియట్ విప్లవం నుండి ప్రేరణ పొందారు . కార్మిక , కర్షక విముక్తి లక్ష్యంగా ఉన్న సోషలిజం స్థాపించడానికి కృషి చేశారు . దానికి పూర్తి విరుద్ధంగా , జర్మనీ , ఇటలీ దేశాలలోని ఫాసిజం నుండి ప్రేరణ పొందింది ఆరెస్సెస్ . పెట్టుబడిదారీ దోపిడీని అత్యంత క్రూరంగా అమలు చేయడమే ఫాసిజం లక్ష్యం .
 12. ఆరెస్సెస్ గాని , హిందూ మహాసభ కాని స్వాతంత్రోద్యమంలో ఏనాడూ , ఏ దశలోనూ పాల్గొనలేదు . ఈ కాలం ముస్లిం దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తూ ప్రచారం చేయడం , మత కల్లోలాలను రెచ్చగొట్టడం వారి కార్యక్రమంగా పెట్టుకున్నారు . నిజానికి స్వాతంత్రోద్యమంలో అన్ని దశల్లోనూ ముస్లింలు ముఖ్యమైన పాత్రనే పోషించారు . త్యాగాలకు ముందున్నారు . 1857 ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర గణనీయమైనది . హిందూ – ముస్లిం సైనికులు అపూర్వమైన ఐక్యతను ఈ పోరాటంలో ప్రదర్శించారు . ఆ తర్వాత 1915 లో సింగపూర్ తిరుగుబాటు లో ముస్లింలదే ప్రధాన పాత్ర . గదర్ ఉద్యమ ప్రేరణతో 15 వ పదాతిదళం ఈ తిరుగుబాటులో పాల్గొంది . అందులో ముస్లింలు ప్రధానం . అందరినీ బ్రిటిష్ ప్రభుత్వం విచారణ లేకుండా కాల్చివేసింది . సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా , సహాయనిరాకరణ ఉద్యమంలో , ఉప్పు సత్యాగ్రహంలో , క్విట్ ఇండియా ఉద్యమంలో ఇలా అన్ని దశల్లోనూ ముస్లింలు చురుకుగా పాల్గొన్నారు . అమరవీరుడు అప్పబుల్లాఖాన్ , కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడు ముజఫర్ అహ్మద్ , హజత్ మెహానీ , సరిహద్దు గాంధీ గా పేరు గాంచిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వంటి పేర్లు ప్రముఖమైనవి . కాని ఆరెస్సెస్ మాత్రం ముస్లింలు దేశానికి శత్రువులు అని ప్రచారం చేస్తుంది .
 13. గొప్ప దేశభక్తుడు అని సావర్కర్ ను ఆరెస్సెస్ కీర్తిస్తుంది . అతడి చరిత్ర ఏమిటి ? తొలి నాళ్ళలో హిందూ తీవ్ర వాద సంస్థలు సాయుధ దళాలను తయారు చేసి బలప్రయోగం ద్వారా ఈ దేశాన్ని హిందూ రాజ్యంగా మార్చాలని ప్రయత్నించాయి . ఆ విధమైన తీవ్ర వాద కార్యకలాపాలకు గాను బాబారావ్ అనే హిందూ నాయకుడికి యావజ్జీవ శిక్ష విధించారు . శిక్ష విధించిన అధికారి విలియం కర్జన్ వైల్ . అతనిని చంపి ప్రతీకారం తీర్చుకోడానికి కుట్ర పన్నారు . దానికి సూత్రధారి విడి . సావర్కర్ . తన అనుచరుడైన మదన్‌లాల్ ధింగ్రాను పురికొల్పి హత్య చేయించాడు . సావర్కర్ . ( 1909 జూలై 1 వ తేదీన ) తీవ్రవాద కార్యకలాపాల మీద విచారణకు ఆదేశించిన జాక్సన్ అనే అధికారిని కూడా హత్య చేయించిన కుట్ర సావర్కర్ద . ( నిజానికి ఆ జాక్సన్ భారతీయుల పట్ల చాలా సానుభూతితో ఉండే వ్యక్తి ) 1909 డిసెంబర్లో జాక్సన్ హత్య జరిగింది . ఈ రెండవ హత్య కేసులో సావర్కర్ కు యావజ్జీవ శిక్ష పడింది . 1910 డిసెంబర్ లో శిక్ష పడింది . 1911 జూలై 4 న అండమాన్ పంపారు . ఏడాది తిరగకుండానే .. బ్రిటిష్ ప్రభుత్వాన్ని క్షమాభిక్ష కోరుతూ అర్జీ పంపాడు . మళ్ళీ 1913 లో రెండో అర్జీ పంపాడు . ” ప్రభుత్వం ఏ విధంగా సేవ చేయమన్నా చేస్తాను . నన్ను విడుదల చేయడం ద్వారా మీరు పొందగలిగేంత , నన్ను జైలులో ఉంచడం ద్వారా పొందలేరు …. శక్తివంతుడే కరుణామయుడు కాగలడు . దారి తప్పిన బిడ్డ తల్లిదండ్రుల ఆపేక్ష వంటి ప్రభుత్వపు ద్వారాల వద్దకే చేరగలడు ” అని అందులో హీనమైన లొంగుబాటు ప్రదర్శించాడు . ఆ తర్వాత మరో రెండు హామీ పత్రాలు కూడా రాసి ఇచ్చాడు . ” ఈ కేసులో విచారణ సహేతుకంగా జరిగింది . విధించిన శిక్ష న్యాయమైనదే . గతంలో చేపట్టిన హింసాత్మక మార్గాలను విసర్జిస్తున్నాను . చట్టాన్ని , రాజ్యాంగాన్ని గౌరవిస్తాను . సంస్కరణల విజయవంతానికి ( 1918 లో తెచ్చిన మాంటేగ్ ఛెక్స్ఫర్డ్ సంస్కరణలు – వీటిని ప్రజలంతా తిరస్కరించారు కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను . విడుదల అయిన తర్వాత 1925 లో ఆరెస్సెస్ స్థాపించాడు . ఆ తర్వాత ఒక సందర్భంలో రాసిన వ్యాసం మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా ఉందంటూ బ్రిటిష్ ప్రభుత్వపు జిల్లా మెజిస్ట్రేట్ ఒక తాఖీదు పంపాడు . అందులో ‘ స్వరాజ్య ‘ అన్న పదం వాడినందుకు అభ్యంతరం పెట్టాడు . దానికి సమాధానంగా సావర్కర్ ఆపదం వాడినందుకు క్షమాపణ కోరాడు . హత్యలకు కుట్రలు పన్నడమే తప్ప ప్రత్యక్షంగా భాగస్వామి కాలేదు . శిక్షకు తట్టుకోలేక వెంటనే లొంగుబాటు ప్రదర్శించాడు . ఇదీ సావర్కర్ వీరత్వం .
 14. గాంధీజీ హత్య : 1948 జనవరి 30 న గాంధీజీని నాధూరాం గాడ్సే హత్య చేశాడు . గాడ్సే ఆరెస్సెస్ బౌద్ధిక కార్యకర్త . ఆ హత్యకు సూత్రధారి సావర్కర్ . ఈ విషయాన్ని ఆ కేసులో అప్రూవర్‌గా మారిన దిగంబర్ బాగ్దే తన సాక్ష్యంలో చెప్పాడు . ఆ తర్వాత నాధూరాం గాడ్సే సోదరుడు గోపాల్ గాడ్సే తన ఇంటర్వ్యూ లో కూడా చెప్పాడు . ఐతే అప్రూవర్ సాక్ష్యం . బట్టి శిక్ష విధించడం కుదరదు కనుక సావర్కర్ శిక్ష నుండి తప్పించుకున్నాడు . తనపై కేసు లేకుండా చేసుకోడానికి తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని 1948 ఫిబ్రవరిలో సావర్కర్ సంసిద్ధత వ్యక్తం చేశాడు .
 15. బ్రిటిష్ పాలకులతో కుమ్మక్కు : 1939 లో రెండో ప్రపంచ యుద్ధం మొదలవగానే సావర్కర్ వైస్రాయి లార్డ్ లిన్లిత్ ను కలిసి హిందువుల మద్దత్తు తీసుకోవాలని కోరాడు . ఈ సమావేశం అనంతరం వైస్రాయి లండన్ కు పంపిన నివేదికలో ” గతంలో హిందూత్వ శక్తుల నుండి కొన్ని ఇబ్బందులు వచ్చినా , ప్రస్తుతం పరిస్థితి మారింది . హిందూ శక్తుల సహాయం తీసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది . ” అని పేర్కొన్నాడు . 1942 లో కాంగ్రెస్ ‘ క్విట్ ఇండియా ‘ తీర్మానం చేసినప్పుడు దానిని ఆరెస్సెస్ బహిరంగంగానే వ్యతిరేకించింది . తన సభ్యులెవరూ ఆ ఉద్యమంలో పాల్గొనరాదని , బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించాలని సర్కులర్ పంపింది .
 16. ద్విజాతి సిద్ధాంతం : హిందువులు , ముస్లింలు రెండు వేరు వేరు జాతులని , రెండింటి ప్రయోజనాలు పరస్పరం శతృ పూరితమైనవని సిద్ధాంతం తెచ్చింది సావర్కర్ , ఆ తర్వాత దానిని జిన్నా కూడా అందుకుని పాకిస్తాన్ నినాదం ముందుకు తెచ్చాడు . దానిని సమర్ధిస్తూ ఆరెస్సెస్ వ్యవహరించింది . హిందూ మహాసభ ముస్లింలీగ్ తో కలిసి పశ్చిమాన సింద్ రాష్ట్రంలోను , తూర్పున బెంగాల్ లోను ప్రావిన్షియల్ ప్రభుత్వాలలో భాగస్వామిగా ఉంది . ఆ సమయంలో ఆ రెండు అసెంబ్లీలలోను లీగ్ పాకిస్తాన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది . ఆ తీర్మానాన్ని రెండు చోట్లా హిందూ మహాసభ బలపరిచింది .
  19 , మతఘర్షణలు : 1946-48 మధ్య దేశంలో వివిధ ప్రాంతాల్లో మత కల్లోలాలు చెలరేగాయి . వీటన్నింటిలో ఆరెస్సెస్ పాత్ర ఉన్నట్టు సాధికారిక నివేదికలు స్పష్టం చేశాయి . అప్పటికే ప్రభుత్వంలోని వివిధ సంస్థల్లో , సైన్యంలో , పోలీసుల్లో ఆరెస్సెస్ నెట్వర్క్ చొరబడింది . దానిని కూడా ఈ మత మారణకాండకు వినియోగించింది ఆరెస్సెస్
 17. కాశ్మీర్ కాశ్మీర్ కున్న రాష్ట్ర ప్రతిపత్తిని , 370 అధికరణను రద్దు చేయడం గొప్ప విజయంగా మోడీ ప్రభుత్వం చెప్పుకుంటోంది . కాశ్మీర్ ను ఈ చర్యల ద్వారా దేశంలో అంతర్భాగం చేసినట్టు చెప్పుకుంటోంది . కాని వాస్తవానికి 1947 లో కాశ్మీర్ ను పాలించిన రాజు హరిసింగ్ భారతదేశంలో విలీనం చేయడాన్ని వ్యతిరేకించాడు . అప్పుడు అతడిని సమర్థించింది . హిందూ మహాసభ . అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ షేక్ అబ్దుల్లా నాయకత్వంలో భారతదేశంలో విలీనం చేయాలని ఉద్యమించింది . ఆ ఉద్యమాన్ని కూడా హిందూ మహాసభ వ్యతిరేకించింది .
 18. తెలంగాణా : నైజాం ప్రభువు హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి వ్యతిరేకంగా ఉ న్నాడు . ఆ నైజాం మీద కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు పోరాడుతున్నారు . ఆ పోరాటానికి ఆరెస్సెస్ మద్దత్తు నివ్వలేదు . సరికదా మత విద్వేషాలు రెచ్చగొట్టి ఉద్యమాన్ని చీల్చడానికి ప్రయత్నించింది . ఆ తర్వాత నైజాం కమ్యూనిస్టుల ధాటికి తట్టుకోలేక విదేశాలకు పారిపోయాడు . అప్పుడు భారత సైన్యం వచ్చి కమ్యూనిస్టులను ఊచకోత కోసింది . 4000 మంది ప్రాణాలను బలి తీసుకుంది . ఉద్యమ నేతలతో శాంతియుత చర్చలు జరిపి హైదరాబాద్‌ను దేశంలో విలీనం చేయడానికి ప్రయత్నించవలసిన ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించింది . ఆ సైనిక చర్యను తెలంగాణా విముక్తి దినం అని చెప్పి సంబరాలు చేసుకుంటుంది ఆరెస్సెస్ . 22. జాతీయజెండా : ఇప్పుడు ఇంటింటి మీదా త్రివర్ణ పతాకం ఎగరాలని హడావుడి చేస్తోంది మోడీ ప్రభుత్వం . కాని ఆరెస్సెస్ మొదటినుండీ ఈ జాతీయ జెండాను గుర్తించడానికి నిరాకరించింది . 2000 తర్వాత మాత్రమే జాతీయజెండా విషయంలో వైఖరి మార్చుకుంది . కాషాయ ధ్వజమే దేశానికి జెండాగా ఉండాలన్నది ఆరెస్సెస్ వైఖరి . ఇప్పుడు మాత్రం ప్లేటు ఫిరాయించి హడావుడి చేస్తోంది .
 19. రాజ్యాంగం : భారత రాజ్యాంగాన్ని కూడా ఆరెస్సెస్ అంగీకరించదు . దానిని విదేశీ రాజ్యాంగంగా పరిగణిస్తుంది . మనుధర్మశాస్త్రమే మనదేశానికి రాజ్యాంగంగా ఉండాలన్నది ఆరెస్సెస్ వైఖరి .
 20. జాతీయోద్యమం పట్ల అమరవీరుల త్యాగాల పట్ల , ఆరెస్సెస్ నాయకులు ప్రకటించిన అభిప్రాయాలు :
  ( ఎ ) ” బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం అవివేకం . పెద్ద చేప చిన్న చేపను తింటుంది . అదే విధంగా బలవంతుడు బలహీనులను దోచుకుంటాడు . ఇది ప్రకృతి ధర్మం . దీనిని వ్యతిరేకించడం తప్పు . హెగ్దేవార్ ( కాని ఇదే తర్కం ముస్లిం రాజుల పాలన విషయంలో మాత్రం అంగీకరించరు . వారి కారణంగానే దేశం అధోగతి పాలైందంటారు . ముస్లిం రాజులు ఈ దేశాన్ని పాలించారే తప్ప సంపదలను కొల్లగొట్టి తరలించుకుపోలేదు . కాని బ్రిటిష్ పాలకులు అపారమైన సంపదను కొల్లగొట్టారు . పైగా ఇక్కడి వృత్తులను , వ్యవసాయాన్ని నాశనం చేశారు . కాని ఆరెస్సెస్ కు బ్రిటిష్ వారు మిత్రులు . ముస్లింలే శత్రువులు ) ( బి ) 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం గురించి ” ఇటువంటి త్యాగాల వలన ప్రయోజనం ఏమిటి ? ప్రజలు దేశం కోసం అన్నీ వొదులుకునేలా ప్రేరేపించ గలిగారా ? సామాన్య ప్రజలకు ఈ త్యాగాలు పట్టవు ” గోల్వాల్కర్ ( సి ) భగత్ సింగ్ , అనుచరుల గురించి : “ వారిది వీర మరణం అనడంలో సందేహం లేదు . కాని వాళ్ళు మనకు ఎన్నటికీ ఆదర్శమూర్తులు కాజాలరు . ఎందుకంటే వాళ్ళు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయారు . అంటే వారిలో ఏదో తీవ్రమైన లోపం ఉన్నట్టే . ” – గోల్వాల్కర్
 21. కష్టాలలో ఉన్న ప్రజలను ఆదుకోవడం విషయంలో : ఆరెస్సెస్ కి సామాన్యప్రజల కష్టాలు ఎప్పుడూ పట్టవు . దేశంలో ప్రజానీకం కరువు కాటకాల్లో మునిగి వున్నప్పుడు సైతం విద్వేషాలను రెచ్చగొట్టేందుకే పూనుకున్నారు . తాజాగా కరోనా కష్టకాలంలో సైతం మూఢ నమ్మకాలనే ప్రచారం చేశారు .

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.