స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

స్వామి వివేకానంద జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా యువతకు పిలుపునిచ్చిన ఫోరం ఫర్ ఆర్.టి.ఐ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డా.సామల శశిధర్ రెడ్డి స్వామి వివేకానంద జనవరి 12 1863 వ సంవత్సరం లో కలకత్తా నగరంలో జన్మించి ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన స్వామి వివేకానంద గారి 158 వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జిల్లా లో మండల కేంద్రాల్లో గ్రామాల్లో సైతం స్వామి వివేకానందుని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని శశిధర్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. నేటి యువత స్వామి వివేకానంద గారి జీవిత చరిత్రను చదవాలని ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. దేశంలో యువత శక్తి సామర్థ్యం ఎనలేనిదని మనదేశ జనాభాలో దాదాపు 50 శాతానికి పైగా యువత ఉన్నారని దేశానికి బలం యువత అని అలాంటి యువకులు దేశానికి ఎల్లప్పుడూ సైనికుల్లా పని చేసే విధంగా అప్రమత్తంగా క్రమశిక్షణతో ఉండాలని శశిధర్ రెడ్డి సూచించారు. యువత సన్మార్గంలో పయనించే విధంగా వారి తల్లిదండ్రులూ పాటుపడాలన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.