స్వామి వివేకానంద158వ జయంతి వేడుకల

జిల్లా క్రీడా సంస్థ మరియు నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద158వ జయంతి వేడుకలకు హాజరైన ఫోరం ఫర్ ఆర్.టీ.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షుడు మరియు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ శశిధర్ రెడ్డి వరంగల్ జిల్లా హనుమకొండలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం నందు వరంగల్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ మరియు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవం మరియు స్వామి వివేకానంద 158 వ జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరై ప్రసంగించిన ఫోరమ్ ఫర్ ఆర్.టి.ఐ రాష్ట్ర యువజన అధ్యక్షులు మరియు డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డా.సామల శశిధర్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ జనాభాలో 50 శాతానికి పైగా యువత ఉన్నదని దేశానికి బలమైన యువత రాబోయే రోజుల్లో ఎలాంటి యుద్ధాలు సంభవించిన నడుం బిగించి ధైర్యంగా ముందడుగు వేసి దేశ రక్షణ కోసం పడాలని పిలుపునిచ్చారు. జనవరి 12 1863 సంవత్సరంలో కోల్కతాలో జన్మించిన స్వామి వివేకానంద అతి చిన్న వయసులోనే చికాగోలో ప్రసంగించి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించిన మేధావి స్వామి వివేకానంద అని ఆయన గుర్తు చేశారు ఇప్పటికైనా దేశంలోని యువతీ యువకులంతా స్వామి వివేకానంద గారి ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు నీతి నిజాయితీ పట్టుదల కృషి తో క్రమశిక్షణతో శ్రమిస్తే తప్పకుండా గొప్ప విజయాన్ని చేరవచ్చని ఆయన వివరించారు. దేశానికి యువత వెన్నుముక అని అలాంటి యువత నేడు ఇలాంటి నడవడికలో ఉన్నారు మనమంతా ఒక సారి గుర్తు చేసుకోవాలన్నారు. ప్రతి వ్యక్తికి దేశం పట్ల సమాజం పట్ల భక్తి శ్రద్ధలు గౌరవం ఉండాలని రాబోయే రోజుల్లో భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలు సైతం అభినందించే స్థాయికి మనం ఎదగాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అధికారి ఇ అశోక్ కుమార్ మరియు నెహ్రూ యువ కేంద్ర వరంగల్ రూరల్ జిల్లా అధికారి అన్వేష్, ఇందిరా జాతీయ యువజన అవార్డు గ్రహీత మధుగారు మరియు యువజన సంఘాల నాయకులు నరేష్ మరియు వరంగల్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ శిక్షకులు యువత పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.