జనగామ జిల్లా న్యాయస్థానం వద్ద రీలే నిరాహార దీక్ష

హైకోర్టు లాయర్ దంపతుల దారుణ హత్యను ఖండిస్తూ జనగామ జిల్లా న్యాయస్థానం వద్ద రీలే నిరాహార దీక్ష చేస్తున్న న్యాయవాదులకు జనగామ జిల్లా అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి గారి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ…

భారత రాజ్యాంగాన్ని, భారత దేశ పౌరుల హక్కులను మరియు సమానత్వాన్ని కాపాడే న్యాయమూర్తులను ఇంత నిర్దాక్షిణ్యంగా స్వార్థపూరిత రాజకీయం కోసం నరికి చంపడం టిఆర్ఎస్ ప్రభుత్వం నిరంకుశత్వం పాలన కి నిదర్శనం.

దేశంలో ఇప్పటికీ ప్రశ్నిస్తే గొంతు బ్రతుకుతుంది అంటే దానికి నిలువెత్తు నిదర్శనం న్యాయమూర్తులు. వారి వృత్తిని వారు సక్రమంగా నిర్వహిస్తూ సమాజంలో ఉన్న ప్రశ్నించే గొంతుకలకు ప్రాణం పోస్తున్నారు.

న్యాయ దేవత కళ్ళకి గంతలు కట్టి ఉంటాయని ఏది చేస్తే అది నడుస్తోందని విర్రవీగుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి నూకలు చెల్లాయి. మీ పతనం ప్రారంభమైంది.. ఎంతో దూరంలో లేదు.

సామాన్యుడికి న్యాయం జరగాలంటే న్యాయవ్యవస్థ  సురక్షితంగా ఉండాలి.

ఈ రోజుకి ఒక సామాన్యుడు తల ఎత్తుకొని జీవిస్తున్నాడు అంటే కారణం భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగాన్ని కాపాడుతున్న న్యాయమూర్తుల గొప్పతనం.

ఇంత నిస్వార్ధమైన సేవ చేస్తున్నా న్యాయమూర్తులను చంపడం ప్రభుత్వం యొక్క వైఫల్యం మరియు కక్ష సాధింపు చర్యలు.

ఇలాంటి స్వార్ధపరులు, కూని కొర్లు ఉంటారని ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో న్యాయ వ్యవస్థ ఒక ప్రత్యేకమైన స్థానం కల్పించారు. కానీ నేడు టిఆర్ఎస్ నాయకులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు న్యాయవ్యవస్థను హతమార్చే ప్రయత్నం చేస్తున్నారు.

అధికార పార్టీలో ఉన్న నాయకుల బంధువులకు ఆపద వస్తే పోలీసు వ్యవస్థ గంటల్లో వారిని పట్టుకుని జైల్లో వేస్తుంది. కానీ సామాన్య ప్రజల కోసం నిస్వార్ధంగా పనిచేస్తున్న న్యాయవాదులను హత్య చేస్తే ఏం చేస్తుంది పోలీస్ పోలీసు వ్యవస్థ అధికార పార్టీలో ఉన్న వారికి ఒక న్యాయం సామాన్య మానవుడికి ఒక న్యాయమా…

చనిపోతూ కూడా న్యాయ వ్యవస్థను కాపాడేందుకు తన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చిన ఇంకా పోలీసు వ్యవస్థ నిమ్మకు నీరెత్తినట్టు గా ఉంది. చంపబడ్డ వ్యక్తే తను చంపబడ్డ వ్యక్తిని గురించి చెప్తే అన్ని సాక్షాధారాలు ఉన్నా కూడా పేర్లు మారుస్తూ దోషులకు శిక్ష పడకుండా ప్రోత్సహిస్తున్నారు.

నేను పోలీస్ వ్యవస్థ కి ఒకటే విన్నవించుకుంటున్నాను న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ సక్రమంగా ఉన్నన్ని రోజులు సామాన్య మానవులు ప్రజలు తమ జీవనాన్ని సురక్షితంగా జివించగలరు ఇది దృష్టిలో ఉంచుకొని సామాన్య ప్రజలకు అండగా ఉండాలని కోరుతున్నాను.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం.

న్యాయవాదులను, న్యాయవాదుల కుటుంబాలను కాపాడేందుకు రక్షణ చట్టాలు ఏర్పాటు చేయాలి.

దేశ ప్రజల హక్కులను కాపాడే న్యాయమూర్తులకు రక్షణ లేకపోతే ఇక సామాన్య మానవుడి పరిస్థితి ఏంటి.

అందుకే న్యాయమూర్తుల జోలికి ఎవరైనా వస్తే వారికి బుద్ధి చెప్పడానికి ఎంత కఠినమైన చట్టాలు తేవాలంటే వాటిని చూస్తే వారు తప్పు చేయాలన్నా భయపడాలి.
ఈ కార్యక్రమంలో డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ ఎర్రమళ్ల సుధాకర్ గారు మాజీ మున్సిపాలిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు టౌన్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి గారు ఎస్సీ సెల్ అధ్యక్షులు శ్రీ రామ్ గారు ఎస్టీ సెల్ సంపత్ నాయక్ గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివరాజ్ యాదవ్ గారు ఫ్లోర్ లీడర్ పాండుగారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ రామ్ చందర్ గారు వంగాల మల్లారెడ్డిగారు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త రెడ్డి గారు రంగరాజు ప్రవీణ్ కుమార్ గారు మాజీ కౌన్సిలర్ దయాకర్ రెడ్డి గారు కౌన్సిలర్లు చంద్ర కళ రాజుగారు చందర్ గారు మల్లేశం గారు బాల్ దే అంజనేయులు గారు కళ్యాణం ప్రవీణ్ కుమార్ గారు మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శర్వాల నర్సింగరావుగారు గౌస్ పాషా గారు జమాల్ షరీఫ్ గారు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.