హనుమకొండ చౌరస్తా లో 28 దేశవ్యాప్త సమ్మె

హనుమకొండ చౌరస్తా లో 28 దేశవ్యాప్త సమ్మె సందర్భంగా సిఐటియు,ఆధ్వర్యంలో షాప్ గుమస్తాలు, ఆటో కార్మికులు, హోటల్ కార్మికులు, పెట్రోల్ బంక్,చిరు వ్యాపారులు హనుమకొండ చౌరస్తా నుండి ప్రదర్శన చేస్తూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని , నిత్యావసర ధరలపై నియంత్రణ చేయాలని అశోక జంక్షన్ వరకు ప్రదర్శన జరిగింది.
సిఐటియు హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల సారంగపాణి గారు మాట్లాడుతూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో లక్షలాది మంది గా కార్మికులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నందుకు వారికి కార్మిక అభినందలు తెలియజేస్తూ రేపు జరగబోయే కలెక్టరేట్ ముందు తలపెట్టిన ధర్నాలో కార్మికులు అందరూ పాల్గొని ధర్నా ను జయప్రదం చేయాలని కార్మికులకు వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుమస్తా ఆ సంఘం నాయకులు మహేందర్, అనిల్ , హోటల్ సంఘం నాయకులు రఘు , సంజీవ్, మరియు హనుమకొండ కొత్త బస్టాండ్ చిరు వ్యాపారులు సంఘం, హనుమకొండ చౌరస్తా ఆటో కార్మికులు, నాయకులు ఎస్ ఎస్ ఎఫ్ ఐ జిల్లా సహకార దర్శి వేల్పుల చరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.