వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి అదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున, సెంట్రల్ జోన్ డిసిపి పుష్పా అధ్వర్యంలో హన్మకొండ ఏసిపి జితేందర్ రెడ్డి, కెయూసి, హన్మకొండ, సుబేదారి, మహిళ పోలీస్ స్టేషన్ల ఇన్స్ స్పెక్టర్లు 15 మంది సబ్ ఇన్స్ స్పెక్టర్లతో పాటు మరో 72 మంది ఇతర పోలీస్ సిబ్బందితో కల్సి కెయూసి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపాల్ పూర్, కోమటి పల్లి మరియు జవహర్ నగర్ కాలనిలలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించండం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు చెపట్టిన తనీఖీల్లో 5 బెల్ట్ షాప్స్, ఇద్దరు గుట్కా అమ్మే వారు, అక్రమ టపాసులు, అక్రమ పెట్రోల్ డీజల్, మరియు 2 గ్యాస్ సిలిండర్ లు పట్టికోవడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి జితేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అసాంఘిక కార్యక్రమాలపై పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సెంట్రల్ జోన్ డిసిపి పుష్ప రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు తమ కుటుంబ క్షేమాన్ని దృష్టిలో వుంచుకోని ద్వచక్ర వాహనం నడిపే సమయంలొ తప్పని సరిగా హెల్మెట్ ధరించాలని అలాగే ప్రతి వాహనదారుడు తప్పని సరిగా ట్రాఫిక్ నియమనిబంధనలు పాటించాలని, ప్రజలు తమ వ్యక్తిగత భద్రత కోసం టివి కెమెరాలు పెట్టుకోవాలని ప్రజలను ఎర్పాటు చేసుకోవాలని, ఈవ్ టీసింగ్, అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ప్రజలకు శాంతి భద్రతలకు సంబంధించి ఎదైనా సమస్యలు వుంటే స్థానిక పోలీసులకు తెలయజేయాలని కోరారు.