హమాలి కార్మికుల సంక్షేమం కోసం హమాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి-సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు

తరిగొప్పుల: హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం హమాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు డిమాండ్ చేశారు
మండలంలోని పోతారం లో ఈరోజు హమాలి కార్మికులకు సిఐటియు హమాలి యూనియన్ గుర్తింపు కార్డులు అందజేసిన అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని విమర్శించారు కార్మికులకు ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కూడా కల్పించలేదు అన్నారు దీంతో హమాలి కార్మికులు ప్రమాదాలకు గురై ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు కార్మికులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రమాద బీమా 10 లక్షలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు 50 సంవత్సరాలు దాటిన హమాలి కార్మికులకు నెలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని కోరారు కార్మికుల సంక్షేమం కోసం హమాలి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు హమాలి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో సిఐటియు హమాలి యూనియన్ నాయకులు సుంకు రాజు, యాదయ్య , సాయిలు ,శ్రీనివాస్, కనకయ్య బాలయ్య , కుమారస్వామి ,నరేష్ తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.