janagama news citu news

ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్ జయప్రదం చేయండి
—వాల్ పోస్టర్లు కరపత్రాలు ఆవిష్కరణ

–సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొట్ల శ్రీనివాస్ రాపర్తి రాజు

====================================

జనగామ: హమాలి కార్మికుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం హమాలి ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొట్ల శ్రీనివాస్ రాపర్తి రాజు తెలిపారు

శుక్రవారం జనగామ సివిల్ సప్లై గోదాం హమాలి కార్మికుల సమావేశం బోరెల్లి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా బోట్ల శ్రీనివాస్ రాపర్తి రాజులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హమాలి కార్మికులు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించాయని తీవ్రంగా విమర్శించారు హమాలి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని అన్నారు సివిల్ సప్లై గోదాములలో పనిచేస్తున్న హమాలి కార్మికులు కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు తాగునీటి సౌకర్యం లేదన్నారు గోదాం వద్ద పనిచేస్తున్న హమాలి కార్మికులు కాళ్లు చేతులు కడుకోవడానికి కనీసం నీళ్లు కూడా లేకపోవడం దారుణమన్నారు ఈ సమస్యను జిల్లా కలెక్టర్ సివిల్ సప్లై జిల్లా అధికారుల దృష్టికి అనేకసార్లు తీసుక పోయినప్పటికీ పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు ఇప్పటికైనా చంపకిల్స్ గోదాముల వద్ద త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా వ్యాప్తంగా హమాలి కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 26వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను అలాగే ఆగస్టు 3వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్ జిల్లా నాయకులు చుంచు విజేందర్ తాండ్ర ఆనందం మల్లేష్ రాజ్ పల్లెర్ల శంకర్ హమాలి యూనియన్ నాయకులు బోరెల్లి భాస్కర్ పర్వతాలు శ్రీశైలం యాదగిరి కనకయ్య చెన్నయ్య దశరథం హమాలి కార్మికులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.