హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఉద్యమించాలి.

హమాలీ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకై ఉద్యమించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చిట్యాల సోమన్న అన్నారు. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో అమాలి కార్మికుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి *తొట రాజు అధ్యక్షత వహించగా సోమన్న పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో వివిధ రకాల ఎగుమతి దిగుమతి పనులు చేస్తున్న హమాలీలు సుమారుగా 5 లక్షల మందికి పైగా ఉన్నారని దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నారని. అలాంటి వీరికి పని భద్రత. పని గంటలు.గుర్తింపు కార్డులు పీఎఫ్. ప్రమాద బీమా. పెన్షన్ సౌకర్యం లాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరి దరి చేరడం లేదని హమాలి లో అత్యధికులు బలహీనవర్గాలకు చెందిన నిరుపేదలని అధిక బరువులు మోయడం వల్ల శరీరంలో సత్తువ తగ్గి యుక్త వయసులోనే పనిచేయని స్థితికి వస్తున్నారని నిత్యం దుమ్ము. ధూళి. గాలి వెలుతురు లేని గోదాంలో పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని. పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని కాళ్లు. చేతులు. నడుములు వీరిగి మంచాల కే పరిమితమై జీవచ్ఛవాలుగా మారిన కుటుంబాలను ఆదుకునే దిక్కు లేదన్నారు. హమాలీ కార్మికుల శ్రమ ద్వారా కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలకు వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నా వారి సంక్షేమం కోసం నయా పైసా కూడా ఖర్చు పెట్టడం లేదన్నారు. 2022. మార్చి 28. 29 తేదీలలో జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో హమాలీ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ వెంకన్న.కే అశోక్. భాస్కర్ రెడ్డి. ఏ సమ్మయ్య.సోము చంద్రు. పరిద్. కుమార్ భీమ్లా నాయక్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.