హలియాలో kvps జిల్లా మహసభలు

సామాజిక ఉద్యమాల సారధి కెవిపిఎస్ నల్లగొండ జిల్లా 8 వ మహాసభలు మే 10,11 తేదీలలో హాలియా కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున తెలిపారు. ఈరోజు బుధవారం రోజున హాలియా మండల కేంద్రంలో కొండేటి శ్రీను అధ్యక్షతన ఆహ్వాన సంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ దేశంలో మనువాదు ల అరాచక రాజ్యాంగేతర విధానాల వలన ధళిత గిరిజన ప్రజలకు తీవ్రమైన పెనుప్రమాదం పొంచివుందని అన్నారు. భారత రాజ్యాంగాని నిర్వీర్యం చేస్తుా sc st అట్రాసిటి చట్టం, రిజర్వేషన్ లు తొలగిస్తున్నారని అన్నారు. ధళితుల ఆత్మ గౌరవం పైన దెబ్బకొడుతున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కులదురంహాకార హత్యలు, మహిళలపైన అత్యాచారా హత్యలు పెరిగాయాని అన్నారు. రక్షించాల్సిన పోలీసులు నిందితులకు వత్తాసుపలుకుతున్నారని అన్నారు.

  ఎప్రిల్ నెలాంత గ్రామ మండల మహసభలు జరిపి తహశీల్దారు కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించీ వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ధళితులకు హమి ఇచ్చిన 3 ఎకరాల భుామీ డబుల్ బెడ్ రుాం ఇండ్లు ధళితబందు పథకాలు అర్హులకందరికి ఇవ్వాలనీ కోరారు. ధళిత గిరిజన ఉద్యోగులు మహసభల జయప్రదానికి ఆర్దిక సహకా్రం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. 
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఖూన్ రెడ్డి నాగిరెడ్డి కెవిపిఎస్ జిల్లా ఆఫీస్ బేరర్స్  దైదా శ్రీను, గాదె నర్సింహ, బొట్టు శివకుమార్ ,పేరిక విజయ కుమార్ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కుర్ర శంకర్ నాయక్ , ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు దైదా జానకమ్మ ,ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు ఆకారపు నరేష్ ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కారంపూడి ధనలక్ష్మి  కె వి పి ఎఫ్ జిల్లా నాయకులు  దొంతాల  నాగార్జున దుబ్బ పరమేశ్ దోరెపల్లి మల్లయ్య  వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు రవి నాయక్ సీఐటీయూ జిల్లా నాయకులు కామల్ల గురవయ్య పొదిల వెంకన్న  గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు వేములకొండ  పుల్లయ్య  తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.