బషీరాబాద్: స్థానిక బషీరాబాద్ మండలంలోని బి సి బాయ్స్ హాస్టల్ లో ఎస్ఎఫ్ఐ బషీరాబాద్ మండల్ అధ్యక్షుడు అఖిఫ్ మరియు ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఆసిఫ్ సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆశ విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది. ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లకు చేయాల్సిన బడ్జెట్ ను వెంటనే విడుదల చేయాలని సంక్షేమ హాస్టల్ కోసం మరిన్ని సౌకర్యాలు కల్పించాలని పేర్కొనడం జరిగింది. దానితో పాటు టుటోరియల్ కి సంబంధించిన మ్యాథ్స్ టీచర్ వెంటనే ఏర్పాటు చేయాలని పేర్కొనడం జరిగింది.