హిందూ దేవాలయాలపై దాడులపై అశ్రద్ద వహిస్తున్న

ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాల మీద దేవత మూర్తుల మీద దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పిలుపుమేరకు లేపాక్షి మండల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లేపాక్షి తహశీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ ఉపా తహశీల్దార్ కుమార్ రెడ్డి కి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత 9 నెలలుగా హిందూ దేవాలయాలపై దాడులపై అశ్రద్ద వహిస్తున్నది.అందులో బాగంగా విజయనగరం జిల్లా శ్రీరామ తీర్థం పుణ్యక్షేత్రంలో గల బొడికొండపై ఉన్న శ్రీరామచంద్ర మూర్తి ఆలయంలో రాము ని విగ్రహం ధ్వంసం చేసి రాముని తలను ఖండించి కొలనులో పడవేసిన ఘటన హిందూ సమాజం యొక్క మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయి. యిటువంటి సంఘటనలు తీవ్ర ద్రిగ్బాంతి గురి చేస్తుంది. హిందూ దేవాలయాలపై వరుస దాడులలో నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం , దేవాదాయశాఖ మంత్రి పూర్తిగా విపలమైయారని,దేవాదాయశాఖ మంత్రి వెళ్లంపల్లి శ్రీనివాస్ వెంటనే రాజీనామా చెయ్యాలని దేవాలయాలపై దాడులకు పాల్పడుతున్న దుండగులను గుర్తించి చర్యలు తీసుకోని, కఠినంగా శిక్షించాలన్నారు. ఇటువంటి చర్యలు రాబొవు కాలంలొ జరగకుండా కఠిన చట్టాలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము., రాష్ట్రాంలో శాంతి భధ్రతలను దృష్టిలో పెట్టుకొని హిందువుల మనోభావాలను కాపాడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని అన్నారు.లేపాక్షి తహసిల్దారు కార్యాయలంలో వినతి పత్రాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో
బీజేపీ పార్టీ లేపాక్షి మండల అధ్యక్షుడు బద్రి .బీజేపీ సీనియర్ నాయకులు రవీంద్రనాథ్ ప్రధాన కార్యదర్శి శివదత్తా ఉపాధ్యక్షుడు నరసింహ మూర్తి. బి జె వై ఎం ఉపాధ్యక్షుడు సుమంత్ .బి జె వై ఎం ప్రధాన కార్యదర్శి రాజు .ప్రకాష్ .అశ్వత దాస్ .బీజేపీ సీనియర్ నాయకులు .వేంకటేశప్ప . నగభూషన్ .రవిశంకర్ .చంద్రశేఖర్ నరేష్ గంగాధర్ ఈశ్వర్ నగరాజ్ . తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.