హిందూ ధర్మాన్ని రక్షించిన ఛత్రపతి శివాజీ, హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు సేవా జ్యోతిలో.

మంచిర్యాల జిల్లా తాండూర్ మండల పరిధిలోని బోయపల్లి బోర్డు వేణు నగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయం లో హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు, ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు,జై భవాని వీరశివాజీ అంటూ నినదించారు, అనంతరం సేవా జ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ సత్యకేశవజిత్ సగర మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులకు ఇలాంటి చరిత్రలో నిలిచిన గొప్ప వ్యక్తుల చరిత్రలు తెలియజేసి ఆనాడు ముష్కరుల పాలనలో ఉన్న హిందూ ధర్మాన్ని రక్షించి ఈ హిందూ ధర్మధ్వజం ఎగరవేసాడు, అదే జ్యేష్ట శుద్ధ త్రయోదశి ఛత్రపతి శివాజీ కి పట్టాభిషేకం చేసి హిందూ సామ్రాజ్యానికి రాజును చేసిన రోజే హిందూ సామ్రాజ్య దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి లో జరుపుకొని మనపిల్లలకు శివాజీ వీరగాథలు ప్రతి తల్లి తమ పిల్లలకు చెప్పాలి అని పేర్కొన్నారు, శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ శ్రీదేవి మల్లేశం గజ్జెల్లి (సగర) లు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సమాజంలో ఒక సేవా జ్యోతి గా వెలగాలి స్వశక్తి భారత్ నిర్మాణానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో సేవాజ్యోతి సేవిక ప్రముఖ్ నాగమణి, అశ్విని, సాయి,శంకరం, శ్యామ్ రావ్, లక్ష్మీ, శరణాలయం మానసిక మతిస్థిమితం లేని మహిళలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.