హిజాబ్ నిషేధించబడిన కర్నాటకలో ప్లస్ టూ/పియుసి పరీక్ష ఫలితాలలో
రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన ముస్లిం విద్యార్థినిలు
హిజాబ్ పేరుతో కొన్ని ముఠాలు ముస్లిం విద్యార్థినిల చదువును అడ్డుకునే ప్రయత్నం చేశాయి
వారి అడ్డంకులే విజయాలకు సోపానం-సౌత్ ఇండియా ఎఎంజే ప్రచార కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ జైనుల్ ఆబిదీన్
ఈ69న్యూస్ వరంగల్ జాన్21
సెయింట్ అలోసియస్ పీయూ కళాశాల విద్యార్థిని ఇల్హామ్ రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించారు.600 మార్కులకు గాను 597 మార్కులు సాధించిన ఇల్హామ్ ఒక్క మార్కు తేడాతో మొదటి ర్యాంక్ కోల్పోయింది.
ఇల్హామ్ అంటే దైవిక ఆధ్యాత్మిక ప్రేరణ అని అర్థం.
హిజాబ్ పేరుతో కొన్ని ముఠాలు ముస్లిం విద్యార్థినిల చదువును అడ్డుకునే ప్రయత్నం చేశారు,వారి అడ్డుకు కారణమే ఇలాంటి విజయాలకు సోపానం, ముస్లిం అమ్మాయిలను బయటకు లాగగలమని భావించిన మూర్ఖులకు,విశ్వవిద్యాలయాల,కాలేజిల నుంచి బయటకు లాగడం ద్వారా ముస్లిం బాలికల విద్యా ప్రయత్నాలను నాశనం చేయగలమనే భావించే ముఠాలకు ఈ విజయం అంకితం చేయబడిందని సౌత్ ఇండియా ఎఎంజే ప్రచార కార్యదర్శి వర్గ సభ్యులు ఎంఏ జైనుల్ ఆబిదీన్ ఒక ప్రకటనలో తెలిపారు.