Telugu News Today | తెలుగు వార్తలు |Telugu News|Latest News in Telugu|

లొడీ సాంఘిక సేవ సంస్ధ ఆధ్వర్యంలో హెచ్ఐవి తో జీవిస్తున్న పిల్లలకు మరియు ఆ కుటుంబాల బాధిత పిల్లలకు మంగళవారం 225 మందికి ఎడ్యుకేషన్ సపోర్ట్ గా స్కూల్ బ్యాగులు నోట్ బుక్స్ స్టేషనరీ మరియు నిత్యవసర కిరాణా సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లొడి సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్ ఫాదర్ విజయ పాల్ రెడ్డి గారి అధ్యక్షతన ఫాతిమా నగర్ నందు లోని లోడి బహుళార్థ సాంఘిక సేవా సంస్థ వారి సహకారంతో హెచ్ఐవి జీవిస్తున్న పిల్లలకు మరియు ఎయిడ్స్ బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహార నిత్యవసర సరుకులు మరియు ఎడ్యుకేషన్ సపోర్ట్ గా అందజేశారు. అనంతరం డైరెక్టర్ విజయ్ పాల్ గారు మాట్లాడుతూ లోడి సంస్థ గత ఏడు సంవత్సరాలుగా నిరంతరము ఈ పిల్లలకు సహాయం చేస్తున్నట్లు తెలియజేశారు.ఎప్పుడూ సహాయం చేస్తుంది. చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్ సపోర్టు ఇవ్వడం జరుగుతుంది అందరూ మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని కోరు కున్నారు అలాగే న్యూట్రిషన్ సపోర్టు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి మంచి పోషకాహారం తీసుకోవాలి. మందులను జాగ్రత్తగా వాడాలి లోడి సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అని అన్నారు.

ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బి. యాదగిరి సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు మాట్లాడుతూ పిల్లలు భవిష్యత్తులో ఉత్తమ స్థాయికి చేరుకోవాలని అధైర్య పడకుండా మునుముందు భవిష్యత్తును మంచిగా తీర్చిదిద్దుకోవాలని కోరారు.

ఫాతిమా నగర్ లోని బిషప్ బేరిట హై స్కూల్ ప్రిన్సిపాల్ గారైన ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా సహాయము అందిస్తున్నట్లు ఇకముందు కూడా కొన్ని సంవత్సరాల పాటు ఈ పిల్లలకు పౌష్టికాహారం విద్య వైద్య సహాయం అందించగలరని భవిష్యత్తులో మరింత జీవన నైపుణ్యాలు కలిగిన ప్రోగ్రామ్స్ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో 225 మంది పిల్లలు వారి తల్లిదండ్రులు సంస్థ నుంచి పని చేస్తున్నటువంటి ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరబాబు బాలశౌరి కిరణ్ నగేష్ శామ్యూల్ పాల్గొన్నారు. సంస్థలు కార్యకర్తగా పని చేస్తున్నటువంటి శిరీష అనిత మమత హరీష్ సతీష్ సునీల్ ఆనంద్ రోహన్ పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.