అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో స్థానిక టి . టి. డబ్ల్యూ .ఆర్. ఎస్. బాయ్స్ పాఠశాలలో నిర్వహిస్తూ ఎనిమిదవ రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిసాయి ఈ పోటీల లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది ఈ సందర్భంగా రాష్ట్ర అ సాఫ్ట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శోభన్ బాబు మాట్లాడుతూ నేటితో ఎనిమిదవ రాష్ట్రస్థాయి సీనియర్ సాఫ్ట్బాల్ పోటీలు ముగిశాయని వరంగల్ అర్బన్ హైదరాబాద్ జట్టు చాలా హోరాహోరీగా పోటీలో తమ ప్రతిభను చాటుకున్నారు విజేతగా హైదరాబాద్ జట్టు నిలిచిందని ఈ సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను చక్కగా నిర్వహించిన ఆదిలాబాద్ జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ జాదవ్, సెక్రటరీ గసికంటి గంగాధర్ , ఆర్గనైజింగ్ సెక్రెటరీ జ్యోతి రామ్ మరియు పలు జిల్లాల నుండి వచ్చిన కోచ్ లకు ముఖ్యంగా పాఠశాల సిబ్బంది కి ధన్యవాదాలు తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రధానం అనంతరం నేరడిగొండ కస్తూర్బా మరియు ఉన్నత పాఠశాల విద్యార్థినులు పూజ ,నందిని, నృత్య ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.