ఏకగ్రీవంగా ఎన్నికవడం జిల్లాలోని కెమిస్ట్ సభ్యులు మాపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి, తార్కాణం

అసోసియేషన్ అధ్యక్ష , కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్ష , సంయుక్త కార్యదర్శి, హోల్సేల్ వింగ్ చైర్మన్ మరియు రిటైల్ వింగ్ చైర్మన్ పదవులకు ఒక్కొక్క నామినేషన్ దాఖలు అయి ఏకగ్రీవంగా ఎన్నికవడం జిల్లాలోని కెమిస్ట్ సభ్యులు మాపై ఉంచిన నమ్మకానికి, విశ్వాసానికి, తార్కాణంగా భావిస్తున్నాము.

రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మీ అందరి సహాయ సహకారాలు మరియు అండదండలతో జిల్లాలోని కెమిస్ట్ ల సమస్యలను పరిష్కరించటానికి, మరియు వారి శ్రేయస్సు కి తోడ్పడే మరిన్ని ఉపయుక్త కార్యక్రమాలను రూపకల్పన చేయటానికి మా వంతు కృషి చేయగలమని హామీ ఇస్తున్నాము.

మమ్ములను ఆదరించి అడుగడుగునా మాకు సహకరించి మా పై ప్రేమ, ఆదరాభిమానాలు చూపిన కెమిస్ట్ మిత్రులకు హృదయపూర్వక కృతఙ్ఞతలు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.