10వ తరగతి విద్యార్థులకు స్టడీమటీరియల్ అందజేసిన-పల్లే రాజిరెడ్డి

జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో జెడ్పీ హైస్కూల్ లోని పదవతరగతి చదువుతున్న 12మంది విద్యార్థులకు హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి సహకారంతో ఆల్ఇన్ వన్, పెన్నులు,ఫ్యాడ్లు అందజేసినట్లు సామాజిక కార్యకర్త పల్లె రాజిరెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ మెటీరియల్ ను ఉపయోగించి బాగా చదువుకొని పరీక్షలో10/10 మార్కులు సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి ఎం దేవిక, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.