10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి

ఆర్థికంగా వెనుకబడిన ఓసి పేదలకు విద్యా ఉద్యోగాల్లో కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తక్షణమే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి ని డిమాండ్ చేసిన ఓసి జేఏసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సామల శశిధర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఓసి సంఘాల సమాఖ్య తరపున తమరికి విన్నవించునది ఏమనగా ఓసి సామాజిక వర్గానికి చెందిన పేదల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత కొన్ని ఏళ్లుగా రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో ఓసి సంఘాల ఐకాస ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో నిర్వహించిన అనేక పోరాటాలకు స్పందించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తేది:08-01-2019 రోజున ఆర్థికంగా వెనుకబడిన ఓసీ పేదలకు విద్యా ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసి రెండు ఏళ్ళు దాటింది… కేంద్ర ప్రభుత్వ సర్వీసులతో పాటు చాలా రాష్ట్రాల్లో 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఓసి పేదలకు అమలు చేస్తుండగా మన తెలంగాణ రాష్ట్రంలో నేటి వరకు కూడా అమలు పరచడం లేదు…. రెండేళ్లుగా రాష్ట్రంలో పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వలన అక్టోబర్ నెల 12 నుండి రాష్ట్రం లో నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ లో కూడా దాదాపుగా 70 వేల మంది ఓసి పేద విద్యార్థులకు విద్య ఉద్యోగ రంగాల్లో తీవ్ర నష్టం జరిగింది….. 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు పరచాలని అనేకమార్లు అనేక రూపాల్లో అన్ని ఓసి సంఘాల వారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం కలగలేదు…. రాజ్యాంగ సవరణ ద్వారా విద్య ఉద్యోగాల్లో ఓసి పేదలకు కేంద్రం కల్పించి అమలు చేస్తున్న విధంగా పది శాతం ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్రంలో వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. తాము ఏ కులానికి మతానికి రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు అన్ని కులాలలోని పేదలతో పాటు నిరుపేద ఓసీలకు విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో న్యాయం జరగాలనేదే మాలక్ష్యం. కావున ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచించి తెలంగాణ రాష్ట్రంలోని ఓసి పేదలకు 10% రిజర్వేషన్ వెంటనే అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు శశిధర్ రెడ్డి తెలిపారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.