#e69news

మరిపెడ లో ఏ ఐ టి యు సి , సిపిఐ పార్టీ ల ఆధ్వర్యంలో జరిగే 136వ మే డే ఉత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పోగుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం మరిపెడ పట్టణ కేంద్రంలోని ఎఫ్ సి ఐ గోదాం దగ్గర మేడే ఉత్సవాల గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ 1886 సంవత్సరంలో 18 గంటల పనిదినం తగ్గించాలని డిమాండ్ చేస్తూ కార్మిక హక్కుల కోసం పోరాడి ఆ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ ప్రపంచవ్యాప్తంగా జరిగే మేడే ఉత్సవాలను విజయవంతం చేయాలని పోగుల శ్రీనివాస్ గౌడ్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. బిజెపి నరేంద్ర మోడీ ద్వారా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కార్మిక హక్కులను చట్టాలను కాలరాస్తూ కార్మికులకు వ్యతిరేకంగా విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు అంటే కార్మిక వర్గం ఎర్రజెండా పోరాటాల ద్వారానే కార్మిక హక్కులు సాధించుకో గలమని శ్రీనివాస్ తెలిపారు. హమాలీలు రుక్షా కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు, సిటీ హమాలీలు కార్మిక ,కర్షక రైతాంగం, వ్యవసాయ కూలీలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు మేడేలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ టౌన్ కార్యదర్శి ఎం.డి రషీద్, పోలే పాక వెంకన్న, మల్లె పాక యాకన్నా, హమాలీలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.