14న జరుగు బిజెపి బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలి-స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ పెరుమాళ్ల వెంకటేశ్వర్లు
ఈ69 న్యూస్ జఫర్ఘడ్ మే12
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ చేపట్టిన రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం బిజెపి ఇంచార్జ్ పెరుమాళ్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.వారు మీడియాతో మాట్లాడుతూ..ఈనెల 14వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని తుక్కుగూడలో జరుగు బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొనుచున్న సందర్భంగా స్టేషన్గన్పూర్ నియోజకవర్గంలోని ప్రతి బూత్ కు 20మంది చొప్పున 5వేలకంటే ఎక్కువ మందిని తరలించేందుకు నియోజక వర్గంలోని నాయకులు కార్యకర్తలు కలిసి కృషి చేయాలని కోరారు.
