18 సం.నిండిన ప్రతి ముదిరాజ్ కులస్థునికి మత్సకార సభ్యత్వం

18 సం.నిండిన ప్రతి ముదిరాజ్ కులస్థునికి మత్సకార సభ్యత్వం ఇచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్థూ కాటారం చౌ రాస్తా దగ్గర తెలంగాణ ముది రాజ్ మహసభ మంథని నియోజకవర్గ ఇంచార్జి.”అట్టె0 రమేశ్ ముదిరాజ్ “గారి ఆధ్వర్యం లో ముఖ్య అతిది గా విచ్చెసిన కాటారం PACS చైర్మన్ చల్ల నారయణ రెడ్డి, నియోజకవర్గ ముది రాజ్ కులస్థుల తో కలిసి సిఎం కెసిఆర్ గారికి, వైద్య శాఖ మంత్రి వర్యులు ఈటల రాజేందర్ గారికి,మత్స శాఖ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి,తెలంగాన ముదిరాజ్ మహసభ రాష్ట్ర అద్య క్షులు,రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్ ముదిరాజ్ గారికి పెద్దపల్లి ,జయశంకర్ భూపాలపల్లీ జిల్లా జెడ్పి ఛైర్మన్లు పుట్ట మధుకర్ గారికి,జక్కు శ్రీ హర్శిని గారికి పాలాభిశెకం చేసారు.ముఖ్య అథిది గా PACS చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి గారు పాల్గొన్నారు.ఈ సందర్బంగా అట్టె0 రమేశ్ మాట్లాడుతూ .. ఎన్నో సంవత్సరాల ముదిరాజ్ కులస్థుల కోరిక నెరవేరుతునందుకు చాలా సంతోషంగా ఉందన్నారు .ముదిరాజ్ కుల అభివృద్దికి సీఎం కెసిఆర్ గారు ఉచిత చేప పిల్లల పంపిని, 80% తో సైకిల్ మోటార్లు, టాటా ఏస్ లు,ముది రాజ్ యువకులకి ఖేజ్ కల్చర్ ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రవేశ పెట్టి సామాజిక,ఆర్థిక,రాజకీయ రంగాల్లో ముదిరాజ్ కుల అభివృద్దికి తోడ్పాటు అందజేయడం ముదిరాజ్ కులస్థులు సీఎం కెసిఆర్ గారికి రుణపడి ఉంటాము అని అట్టె0 రమేశ్ పేర్కొన్నారు.ముఖ్య అథిదీ గా విచ్చెసిన PACS ఛైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ముది రాజ్ కులానికి సీఎం కేసిఆర్ గారు ముదిరాజ్ కులస్తుల ని అన్ని రంగాల్లోకి తీసుక రావడానికి విశేష కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో తెలంగాణ ముదిరాజ్ మహసభ నాయకులు జొడు శ్రీనివాస్ ,ఒలపు రాజభాపు ,అక్కినవెని సమ్మయ్య,తూటీ మనోహర్,అక్కినవెని సుమన్ ,రవీందర్ ,ఎర్రొల్ల మధు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.