YSRCP రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

నందిగామ టౌన్ :

19 వ వార్డు హనుమంతుపాలెంను అభివృద్ధి చేస్తాం : YSRCP రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్

నందిగామ పట్టణంలోని 19 వ వార్డు హనుమంతుపాలెం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కాలనీ వాసులతో పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మొండితోక కుమార్ గారు సమావేశం నిర్వహించారు ,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హనుమంతుపాలెం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తామని ,కాలనీలో మౌళిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ,ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఇప్పటికే హనుమంతు పాలెం అభివృద్ధి ప్రణాళికకు రూపకల్పన చేశారని తెలిపారు ,

ముఖ్యంగా హనుమంతుపాలెంకు బస్సు సౌకర్యం తో పాటు ,డ్రైనేజీలు నిర్మాణం ,స్మశాన వాటిక ఏర్పాటు మరియు ఇతర మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తామని తెలిపారు

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.