2 సంవత్సరాలుగాఆగిపోయినా పెన్షన్లు,రేషన్ కార్డులు వెంటనే మంజూరుచేయాలి

…… పాలడుగు ప్రభావతి, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతరెండుసంవత్సరాలుగా రేషన్ కార్డులు పెన్షన్లు మంజూరు చేయడం లేదని వెంటనే అర్హత ఉన్నవారికి మంజూరు చేయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ఈరోజు కనగల్ మండలం జి ఎడవెల్లి గ్రామంలో పార్టీ శాఖ సమావేశం రాత్రిపూట జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రభావతి మాట్లాడుతూ వితంతు పెన్షన్లు వికలాంగుల పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్లు రాక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారని అన్నారు .నూతనంగా పెళ్లయిన వారికి రేషన్కార్డులు మంజూరు చేయడం లేదని అన్నారు.మరియు సంక్షేమ పథకాలు ఆగిపోయాయని అన్నారు వృత్తిదారులకు దళిత గిరిజన బీసీలకు సంక్షేమ పథకాలు మంజూరు చేయాలని కోరారు .మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నత్తనడకన సాగుతున్నాయని వెంటనే పూర్తి చేయాలని అర్హులైన వారికి ఇవ్వాలని కోరారు.కనగల్ మండలం లోని రైతాంగానికి ఎస్ఎల్బీసీ నీటిని పిల్లకాల్వలు వెంటనేపూర్తిచేసి అందించాలని కోరారు.నల్లగొండ నుండి కనగల్ వెళ్లే రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.*
ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కాని కానుగు లింగస్వామి బిక్షం ఎల్లయ్య పుల్లయ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు జిఎడవెల్లి కనగల్ మండలం.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.