KMM_SFI_NEWS

విద్యారంగ సమస్యల పరిష్కారానికై వామపక్ష విద్యార్థి సంఘాల బంద్ పిలుపు..

ఖమ్మం నగరంలో సుందరయ్య భవన్లో వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బంద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ…

ప్రభుత్వ పాఠశాల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వ విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేయడం దుర్మార్గమని మధు, ప్రవీణ్ ( SFI )
రామకృష్ణ (AISF), వెంకటేష్, ఆజాద్ ( PDSU), మస్తాన్ ( PDSU), మధు (AIFDS ) ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ :- రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఎక్కడ కూడా పటిష్టంగా అమలు చేసే పరిస్థితి లేదన్నారు. ప్రైవేటు విద్యా వ్యాపారం యదేచగా సాగుతున్న ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రైవేటు విద్యా దోపిడీకి గురవుతున్నదాని వారు ఆగ్రహాం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను విచ్చిన్నం చేయడం కోసం జాతీయ విద్యా విధానం 2020 ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించకపోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో పాఠ్యపుస్తకాలు, యూనిఫార్మ్స్ ఇప్పటికీ రాకపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమని, కనీసం మౌలిక సదుపాయాలు కల్పించే పరిస్థితిలో ప్రభుత్వం లేకపోవడం కెసిఆర్ ప్రభుత్వ ద్వందనీతికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో ఖాళీగా ఉన్న డీఈవో ఎంఈఓ టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని భర్తీ చేయకుండా కనీసం పాఠశాల పరిశుభ్రతను కాపాడే స్కావెంజర్స్ ని కూడా నియమించకుండా పాలన చేయడం కెసిఆర్ ద్వందనీతి పాలనకు నిదర్శనం అన్నారు. మన ఊరు మనబడి పథకంలో అన్ని ప్రభుత్వ పాఠశాలను తక్షణమే చేర్చి, సరిపడా నిధులను విడుదల చేయాలని, కార్పొరేట్, ప్రైవేటు ఫీజుల నియంత్ర చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని 20వ తేదీన జరిగే బందులో విద్యార్థులు, ప్రజలు, ఉపాధ్యాయులు, ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంతోష్, తరుణ్ ( SFI ), జయ్, యువరాజ్ ( AISF), లక్ష్మణ్, సుమంత్ (PDSU), ఉపేంద్ర (PDSU) తదితరులు పాల్గొన్నారు…

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.