#TELUGUNEWS #TODAYNEWS #TSNEWS #LOCALNEWS #E69NEWS

దివి:25/02/2022రోజు నా రఘునాథపల్లి మండల ఆఫీసు వద్ద సిపిఎం.ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి గంగాపురం మహేందర్ అధ్యక్షతన జిల్లా కమిటీ సభ్యులు పొదల నాగరాజు రాజు మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను సార్వత్రికం చేసి వంటనూనెలు పప్పులు కూరగాయలు తదితర వస్తువులను ప్రజా పంపిణీ ద్వారా అందించాలని
ప్రభుత్వం 2022-23 బడ్జెట్లో కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం కాకుండా దేశ ప్రజల ప్రయోజనాల రీత్యా బడ్జెట్లో సవరణలు చేసి ప్రజానుకూల బడ్జెట్ గా మార్చాలని
రైతాంగానికి ఉపాధి హామీ కూలీలకు. పేద. సామాన్య. మధ్యతరగతి. ప్రజలకు తీవ్ర నిరాశ కలిగించే విధంగా బడ్జెట్ ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ అధిపతులకు అనేక రాయితీలు ఇచ్చిందని అన్నారు.నిరుపేదలకు రైతాంగానికి ఇచ్చే సబ్సిడీలను ఎత్తివేసింది అని కార్పొరేట్ల పన్ను రాయితీ 12 శాతం నుండి 7 శాతం తగ్గించారని వారన్నారు. కార్మిక హక్కులను హరించే కార్మిక కొడ్ లను. విద్యుత్ ఛార్జీల పెంపు సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలన్నారు. విద్య వైద్య ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెంచాలన్నారు. ఇన్కంటాక్స్ పరిధిలోకి రాని కుటుంబాలకు నెలకు రూపాయలు 7500 నేరుగా నగదు రూపంలో ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మైలారం వెంకటేశ్వర్లు శాగ సాంబరాజు నాల్కపలి దావిద్ పొదల లవకుమార్ సంఘపాక పోశయ్య వేముల సత్యమ్మ కత్తుల ఉపేంద్ర మల్లయ్య పోశయ్య యాదగిరి అంజయ్య సామేలు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.