మార్కెట్ సామర్ద్యం తక్కువ..! సరుకు రావడం చాలా ఎక్కువ..!! వరుస సెలవులకు అసలుకారణం అదే.. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సామర్థ్యం కన్నా.. ఐదింతల ఎక్కువ మిర్చిని రైతులు తెస్తుండడంతో విధిలేని పరిస్థితిలో సెలవులు ప్రకటించక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ సామర్థ్యం ప్రకారం రోజుకు ఐదువేల మిర్చి బస్తాలు రావాల్సి ఉండగా ఇప్పటికే సుమారు 25,000 బస్తాలు మార్కెట్ లో ఉన్నాయి.. వీటన్నింటినీ క్లియర్ చేయాలంటే వారం రోజులకు పైగా పట్టే పరిస్థితి ఉంది.. ఈ..అంశంపై మహబూబాబాద్ మార్కెట్ చైర్ పర్సన్ బజ్జూరి.ఉమాపిచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రైతులు సమస్యను సహృదయంతో అర్దం చేసుకోవాలన్నారు. తప్పని పరిస్థితుల్లో ఈనెల 25వతేదీవరకు మిర్చి మార్కెట్ యార్డుకు సెలవులు ప్రకటిస్తున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు ఈ..అంశాన్ని గమనించాలని కోరారు. 25వ తేదీవరకు మిర్చి తేవద్దని తెలిపారు.