CITU ఆధ్వర్యంలో చెస్ట్ హాస్పిటల్ లో గోడపత్రిక విడుదల చేయడం జరిగింది నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలి జీవో 68 ప్రకారం హాస్పిటల్ కార్మికులకు 21వేల జీతం ఇవ్వాలి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా ,కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జాతీయ సమ్మె జరుగుతుంది ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయరాదు కాంట్రాక్టు విధానం రద్దు చేసి అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి కనీస వేతనాలు వెంటనే అమలు చేయాలి ప్రజాపంపిణీ ద్వారా 15 రకాల నిత్యావసర వస్తువులను సప్లై చేసి పెరిగే ధరలు అరికట్టాలి పెట్రోల్ డీజిల్ చార్జీలు తగ్గించాలి ప్రభుత్వ టీబీ, మెంటల్ హాస్పిటల్ ఎర్రగడ్డలో పనిచేసే ఔట్ సోర్సింగ్ కార్మికులను ప్రత్యేక కేటగిరీలో తీసుకొని వీరికోసం ప్రత్యేక జీవో తీసుకొచ్చి వేతనాలు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు హాస్పిటల్ లో పనిచేసే కార్మికులకు జనవరి ఫిబ్రవరి లో పనిచేసిన వేతనాలు ఇప్పటివరకు ఇవ్వలేదు ఇచ్చే వేతనాలు తక్కువ ఈ జీతాలు కూడా రెగ్యులర్గా రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇంటి కిరాయి పిల్లల ఫీజులు కట్టలేక మానసిక క్షోభకు గురవుతున్నారు.