4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ

ఈ రోజు పర్వతగిరి మండల కేంద్రములో MLC ఎన్నికల కు సంబంధించి ఈ నెల 4వ తేదీ న ఉప్పరపెల్లి క్రాస్ రోడ్ వద్ద గల కల్యాణ లక్మి ఫంక్షన్ హాల్ లో MLC ఎన్నికల భారీ బహిరంగ సభ ఉన్నందున అట్టి కార్యక్రమం గురించి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి సమావేశానికి విచ్చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఇంచార్జి నమిండ్లా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ TRS ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన ను అరికట్టాలంటే, MLC ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ని గెలిపించాలని, 4 వ తేదీ న జరిగే కార్యక్రమములో టీపీసీసీ అధ్యక్షులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ,clp నాయకుడు భట్టి విక్రమార్క,mlc జీవన్ రెడ్డి,వరంగల్ ఖమ్మం నల్గొండ mlc అభ్యర్థి రాములు నాయక్,లు పాల్గొనే ఈ సభకు పట్టభద్రుల ను తరలించి సభను విజయ వంతం చేయడానికి మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చెయ్యాలని అన్నారు.
ఇట్టి కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు జటోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుందూరు వెంకట్ రెడ్డి, గంగాధర్ రావు, సురేందర్ రావు, లాచ్చు నాయక్, యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్, కొమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.