6 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అమీన్

నందిగామ ….

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే నందిగామ పట్టణాభివృద్ధి ..

పట్టణంలోని 6 వ వార్డులో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ..

ఘన స్వాగతం పలికిన నాయకులు ,అభిమానులు, కార్యకర్తలు ..

పట్టణంలోని 6 వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహమ్మద్ అమీన్ ను గెలిపించాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ది పొందిందని ,ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ సంక్షేమ పథకాలను తీసుకొచ్చి బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ మంచి పేరు తెచ్చుకున్నరన్నారు ..

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన రీతిలో 90% వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి తమ అభిప్రాయాన్ని తెలియజేశారని ,మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలుపుతారని థీమా వ్యక్తం చేశారు ..

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.