కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని ఢిల్లీ లో రైతులకు మద్దతుగా

కేంద్రం తీసుకువచ్చిన నూతన రైతు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలని ఢిల్లీ లో రైతులకు మద్దతుగా

దివి:03/12/2020 రోజున రఘునాథపల్లి మండల కేంద్రంలో బస్టాండ్ దగ్గర సిపిఎం మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించడం జరిగింది కార్యక్రమానికి cpm మండల కార్యదర్శి పొదల నాగరాజు పాల్గొని మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉత్తర భారతదేశంలో పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో రైతులు పెద్ద ఎత్తున కదిలి ఢిల్లీలో నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే బిజెపి ప్రభుత్వం వారిపై బాష్పవాయు ప్రయోగం వాటర్ ట్యాంకర్లతో చెల్లాచెదురు చేయడం రైతులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని వారన్నారు బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాల వల్ల రైతులకు ఏమి ఉపయోగం లేదని వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడానికే బిజెపి ప్రభుత్వం పని చేస్తుందని దేశంలో ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసిందని వారన్నారు రైతు చట్టాలను ఉపసంహరించుకోకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రజా సంఘాల నాయకులు కావటి యాదగిరి నాల్కపల్లి దావీద్ కొలనుకొండ చక్రపాణి బంద రవీందర్ పొదల దేవేందర్ పొదల లవకుమార్ కందుకూరి మల్లేష్ పసుల దానిల్ కల్లెడ సుద్దులు గాజుల గట్టయ్య దండిగా రాజు కడారి ఐలయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

50% LikesVS
50% Dislikes

By E69NEWS

One thought on “cpm ప్రజా సంఘాల సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో”

Leave a Reply

Your email address will not be published.