ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు P.ఉపేందర్, R.మీట్యానాయక్, నాయకులు

.

(Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి)

జిల్లాలో అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల్లో రైతుల పంటలను వెంటనే కొనుగోలు చేసిరైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగాజిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని Cpm జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి డిమాండ్ చేశారు.

దివి:19-04-2021సోమవారం రోజున పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించన అనంతరం వివిధ సమస్యలతో కూడిన వినతిపత్రం కలెక్టరేట్ A.O అండాలు గారికి ఇవ్వనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మోకు కనకారెడ్డి పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో రైతులు అనేక ఇబ్బందులు పడి అప్పులు తెచ్చి లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి చేతికొచ్చిన పంటలను అమ్ముకొని తెచ్చిన అప్పులు కట్టి, మిగిలిన కొద్దోగొప్పో డబ్బులు కుటుంబావసరాలకు ఆసరా అవుతుందనుకొంటే ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల్లో పంటల కొనుగోలు చేపట్టక పోవడంతో రైతులు ప్రయివేట్ వ్యాపారులను ఆశ్రయిస్తే పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించక పోగా పంటలకు అతితక్కువ ధరలు చెల్లించి రైతుల నోట్లో మట్టికొడుతున్నారని అన్నారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఐకేపీ కేంద్రాల ద్వారా వెంటనే కొనుగోళ్లు చేపట్టి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని అన్నారు. కొనుగోళ్ల కేంద్రాల వద్ద మంచినీరు, టెంట్లు కనీస సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీ, గన్నీబ్యాగులు, ట్రాన్స్ పోర్టు కొరత లేకుండా చూడాలని తెలిపారు. రైస్ మిల్లు యాజమాన్యం అవినీతిపై చర్యలు తీసుకోవాలని, అవినీతికి పాల్పడిన రైస్ మిల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యేవిధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు, జిల్లా కమిటీ సభ్యులు P.ఉపేందర్, R.మీట్యానాయక్, నాయకులు J.ప్రకాష్, B.చందునాయక్, md.అజారోద్దిన్, D.నాగరాజు, Md బురన్నోద్దీన్, U.వేణు, వినోద్ తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.