KVPS ఆధ్వర్యంలో హనంకొండ మండల వెస్ట్ కమిటీ లో 20 మంది ఏకగ్రీవ ఎన్నిక.

ఈ రోజు ఉదయం 11గంటలకు KVPS పార్టీ జిల్లా ఆఫీస్ ( కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ) ఆధ్వర్యంలో 20 మంది కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సమావేశం లో ముందుగా హనంకొండ వెస్ట్ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంకుడోతు వీరన్న గారు మరియు గిరిజన సంఘం అధ్యక్షులు భాను నాయక్ గారు పాల్గొన్నారు.KVPS ద్వారా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేసారు.
ఇందులో భాగంగా వరంగల్ KVPS కార్యదర్శి మంద సంపత్ గారు మాట్లాడుతూ దళితులు అన్ని విషయాల్లో వెనక బడ్డారని దళితులకు చేరే సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా నీరు గారి పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 70 ఏళ్ళు గడిచినా దిళితులు ఇంకా వెనకబడ్డారని వారు ఇంకా ఓటు బ్యాంకు గానే మిగిలి పోయారని ఆవేదన వ్యక్తం చేసారు. దళితులు అభివృద్ధి చెందాలంటే వారిని చైతన్య పరిచే విధంగా KVPS కార్యక్రమాలు చేపట్టాలని వారు కోరారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరికి ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట,తినడానికి తిండి, ఉచిత విద్య, వైద్యం కల్పించాలని వారు కోరారు.మన తాత, ముత్తాతల నుండి దళితులు ఇంకా వెనక బడి వున్నారని, ఇంకా దళితులు అభివృద్ధి చెంద లేదని ఆయన వాపోయారు. ప్రతి ఒక్క పార్టీ లో దళితులున్నారని వారందరికీ దళిత బంధు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. దళితులని వ్యక్తిగతంగా, పార్టీ ల కోసం వాడుకుంటున్నారు తప్ప వారికి చేసిందేమి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కావున ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇప్పటికైనా ఏక తాటిపై దళితులను చైతన్యం చేయాల్సిన అవసరం KVPS పై ఉందని ఆయన కమిటీ సభ్యులకు సూచించారు. ఇందులో హనంకొండ వెస్ట్ కమిటీ లో 20 మంది సభ్యులలో వరంగల్ జిల్లా కార్యదర్శి మంద సంపత్ గారు హనంకొండ మండల KVPS వెస్ట్ కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. హనంకొండ వెస్ట్ మండల కార్యదర్శి గా దానబోయిన రాంబాబు గారు, అధ్యక్షులు గా ఎనగందుల బాబురావు గారు,ఉపాధ్యక్షులు గా G. పావని గారు ,సహాయ కార్యదర్శి ఇమ్మడి సుధాకర్, బొట్ల సారంగం తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.