sc,st బిసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయం కార్యవర్గ కమిటీ సమావేశం

ఈ రోజు యస్సీ యస్టీ బిసీ మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సరస్వతి అధ్యక్షతన జిల్లా కార్యవర్గ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కమిటీ సభ్యులు నడుచు కోవలసిన పద్ధతులపై మహిళా ఐక్య వేదిక విధి విధానాలను వివరించి మహిళా ఐక్య వేదికను నిజాయితీతో నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లాలని ఆమె కార్యవర్గాన్ని కోరారు. కర్నూలు జిల్లా మరియు నంద్యాల జిల్లాలోని అన్ని మండలాల్లో మహిళా ఐక్యవేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని, మహిళా ఐక్య వేదిక బలోపేతానికి సభ్యులు శ్రమించాలని జిల్లా కమిటీకి తెలియజేశారు. అలాగే మహిళలు తమ ఆత్మగౌరవం, హక్కులకై నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని, మరో వైపు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు, వ్యతిరేకంగా మహిళలంత ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె మహిళా ఐక్య వేదిక సభ్యులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాయలసీమ డివిజన్ అధ్యక్షురాలు భారతమ్మ, నంద్యాల జిల్లా,కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాళ్ళు ఆకుతోట పద్మావతి, మరియు షేకున్ భాను , పాణ్యం నియోజకవర్గ అధ్యక్షురాలు కటికె భాను, కర్నూలు జిల్లా కార్యదర్శి ఉస్సేన్ బీ, ఆళ్ళగడ్డ మండల అధ్యక్షురాలు ముడియం సునీత, నంద్యాల మండల అధ్యక్షురాలు సి.మధుర, కల్లూరు మండల అధ్యక్షురాలు గూడేపొగుల శారా, బేతంచర్ల మండల అధ్యక్షురాలు కొమ్ము పెద్దక్క , కోడుమూరు మండల అధ్యక్షురాలు దస్తగిరమ్మ , గోనేగండ్ల మండల అధ్యక్షురాలు ఖాసింబీ, హోళగుంద మండల అధ్యక్షురాలు సుధాగౌడ్, డోన్ మండల అధ్యక్షురాలు వనం లక్ష్మీ , సి.బెళగల్ మండల అధ్యక్షురాలు ఈశ్వరమ్మ , జయమ్మ , బోయ లక్ష్మీ , మంగమ్మ , సావిత్రమ్మ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.