SFI రాష్ట్ర కార్యాలయం పై NSUI కార్యకర్తలు దాడిని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీగా ఖండిస్తున్నాం

ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యాలయం పై జరిగిన దాడిని నిరసిస్తూ నిర్మల్ ఉదయ్ స్కూల్ ఎదుట ఎన్.ఎస్.యూ.ఐ గూండాల దిష్టిబొమ్మను దగ్థం చేయటం జరిగింది… ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వీ. మధు మాట్లాడుతూ :- నిన్న రాత్రి 10 గం” సమయంలో ఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యాలయం పై ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలు పదుల సంఖ్యలలో వచ్చి దాడులకు తెగబడ్డారు. అప్పటికే వచ్చిన పోలీసుల పై, ఆఫీస్ లో ఉన్న ఎస్.ఎఫ్.ఐ నాయకుల మీద టమాటాలు విసిరినారు. ఆఫీస్, ఆఫీస్ లో ఉన్న కార్యకర్తల మీద దాడులకు పాల్పడి, ఆఫీస్ ధ్వంసం చేయాలనే కుట్ర దీనిలో దాగి ఉంది. ఇలాంటి విద్యార్థి సంఘాల మీద దాడికి పాల్పడే సంసృతిని విద్యార్థి సంఘాలు, విద్యార్థి లోఖం ఖండించాలని అని అన్నారు. కేరళలో రాహుల్ గాంధీ ఆఫీస్ మీద దాడికి పాల్పడిన ఎస్.ఎఫ్.ఐ కార్యకర్తలను సంఘం నుండి తొలిగించినట్లు కేరళ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. కేరళ ముఖ్యమంత్రి కూడా స్పందించారు. అయిన ఎన్.ఎస్.యూ.ఐ వాళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడటం సిగ్గు చేటు. దేశంలో మతోన్మాద రాజకీయాలు, విద్య కాషాయకరణ జరుగుతు రాజ్యాంగ పు హక్కులు హరించే కాలంలో ఇలాంటి దాడులు విద్యార్థి సంఘాల స్నేహపూరిత వాతావరణం దెబ్బతింటు మతోన్మాద చర్యలకు ఊతం ఇస్తుంది. గతంలో కేరళలో దీరాజ్ ఎస్.ఎఫ్.ఐ కార్యకర్త చనిపోయినప్పుడు కానీ మొన్న ఫ్లైట్ లో కేరళ ముఖ్యమంత్రి మీద ఎన్.ఎస్.యూ.ఐ, కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడినప్పుడు కానీ ఎస్.ఎఫ్.ఐ ఏ ఆఫీస్ ల మీద దాడులకు పాల్పడలేదని దీన్ని బట్టి ఎన్.ఎస్.యూ.ఐ, ఎస్.ఎఫ్.ఐ సంఘాల మధ్య తేడా అర్థం అవుతుందని అని అన్నారు. దాడులకు పాల్పడిన ఎన్.ఎస్.యూ.ఐ కార్యకర్తలను శిక్షించాలని డిమాండ్ చేసినారు.ఇలాంటి దాడులకు పాల్పడితే ప్రతిఘటన దాడులు తప్పవని హెచ్చరించారు.. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం కన్వీనర్ తరుణ్, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, ఎస్.ఎఫ్.ఐ నాయకులు ఉపేందర్, దినేష్, కృష్ణ ప్రసాద్, సృజన్ కుమార్, లోకేష్,రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.