ST రిజర్వేషన్ చట్టం అమలు పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం మొండి వైఖరి

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ST రిజర్వేషన్ చట్టం అమలు పట్ల కేంద్ర బిజెపి ప్రభుత్వం మొండి వైఖరిని నిరసిస్తూ తెరాస పార్టీ ఆద్వర్యంలో గిరిజన ప్రజా ప్రతినిధులు,నాయకులు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కుమారి అంగోత్ బిందు,గౌరవ చైర్ పర్సన్, జిల్లా ప్రజా పరిషత్,మహబూబాబాద్ గారు ఈ సంధర్భంగా జెడ్పీ చైర్మన్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులను అభివృధ్ధి చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారు 2011 జనాభా లెక్కల ప్రకారం గిరిజన జనాభా నిష్పత్తి ఆధారంగా 6%ఉన్న ST రిజర్వేషన్ లను 10% కు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ది 16-04-2 017న బిల్లు పాస్ చేసి కేంద్రం ప్రభుత్వ ఆమోదం కోసం ది.29-05-2017న బిల్లును పంపినారని ఆ బిల్లును కేంద్ర ప్రభుత్వo తొక్కి పట్టి ST రిజర్వేషన్ లపై తెలంగాణ ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రతిపాదనలు రాలేదని నిండు పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పేర్కొనడం సిగ్గు చేటని ఇది రాష్ట్ర ప్రభుత్వo పట్ల దమన నీతికి నిదర్శనం అని , 2011జనాభా లెక్కల ప్రకారం గిరిజన దామాషా ప్రకారం గిరిజనులకు అందవలసిన 10%గిరిజన రిజర్వేషన్ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుకోవడం గిరిజనుల పట్ల బిజెపి చిత్త శుద్ధిని తెలియజేస్తున్నది అని బిజెపి తన మొండి వైఖరి వదలి గిరిజనులకు 10% రిజర్వేషన్ అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే గిరిజనులు అందరం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టి కేంద్రంలోని బీజీపీ ప్రభుత్వ మెడలు వంచి గిరిజన రిజర్వేషన్ను సాధిస్తామని తెలిపారు అలాగే గిరిజన యూనివర్సిటీ పట్ల కూడా కేంద్రం మొండి వైఖరి విడనాడి గిరిజన యూనివర్సిటీ కి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా నాయకులు శ్రీ అంగోత్ శ్రీకాంత్ నాయక్ గారు, భూక్యా ప్రవీణ్ నాయక్, తెరాస నాయకులు తమ్మి శెట్టి వేంకటపతి, మాజీ ఎంపీటీసీ గుగులోత్ మంగీ లాల్, మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు శ్రీ పోలేబోయిన వెంకటేశ్వర్లు, భూక్యా లక్ష్మణ్ నాయక్, నర్స తండా సర్పంచ్ రాజు, మీక్క, జర్పుల శ్రీనివాస్, అడిదెల వీరభద్రం, నద్దునూరి లింగయ్య, కున్సోత్ శ్రీను, పగడాల శ్రీనివాస్, బానోత్ రాజేష్, దరంసోత్ రమేష్, గిరి నాయక్, కొర్ర మాన్య, గుండగాని రామనాథం, పాల్తియ అర్జున్, బోడ బాలు, భూక్యా రమేష్ , బానోత్ మంత్రియ తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.