విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి!!

కార్పొరేట్లకు అనుకూలంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్న 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి!*

(రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు, Ex.Mla నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్ లు డిమాండ్.)

మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిస్తున్నట్టు దీని రాష్ట్ర వ్యాప్తంగా విశాలమైన ప్రజానీకం ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి అండగా నిలవాలని, మద్దతూ తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ నియంతృత్వాన్ని ఎండగట్టాలని జనగామ పట్టణంలో బస్సు జాతా సందర్బంగా నిర్వహించిన బహిరంగా సభలో రైతు సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు, Ex.Mla నంద్యాల నరసింహారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన తీగల సాగర్ లు పిలుపునిచ్చారు.

దివి: 13-01-2021 బుధవారం రోజున దేశ వ్యాప్తంగా మూడు రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలని ఢిల్లీ సరిహద్దులో రైతులు చేస్తున్న పోరాటానికి అండగా, మద్దతుగా నిలవడానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతు సంఘం చేపట్టిన బస్సు జాతాను రైతు, వివిధ ప్రజాసంఘాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బస్సు జాతా జనగామ మండలంలోని పెంబర్తి గ్రామంలో ప్రవేశించగా ఎదుర్కోవడం జరిగింది. అక్కడి నుండి బైక్ ర్యాలీగా రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి పట్టణంలోని బాస్స్టాన్డ్ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహానికి రైతు సంఘం నాయకులు పూలమాలలు వేసి అక్కడినుండి నెహ్రూపార్క్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోకు కనకారెడ్డి అధ్యక్షత వహించగా ఈ బస్సు జాతాలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిధులుగా నంద్యాల నరసింహారెడ్డి, తీగల సాగర్ లు పాల్గొని మాట్లాడుతూ రైతులు నిరసన తెలుపలేని కరోనా లాక్ డౌన్ కాలంలో కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టాలు రైతులకు, దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో నష్టాన్ని కలిగించేవని తెలిపారు. విద్యుత్ చట్టాన్ని పూర్తిగా మార్చివేసి కొత్త విద్యుత్ సవరణ బిల్లును, నిత్యం పెంచుతున్న డీజిల్, పెట్రోల్ చార్జీలు, పర్యావరణ ప్రభావ అంచనాలలో కార్పొరేట్లకు అనుకూలమైన మార్పులు, స్వేచ్చా ఒప్పందాలు చేస్తూ ప్రజలపై భారాలు మోపుతున్నారని తెలిపారు. ఈ చట్టాలు అమలులోకి రాకముందు ఉన్న కనీస మద్దతు ధర వ్యవస్థ ప్రస్తుతం ఉండదని అలాగే కొత్త చట్టాల వల్ల రైతుల సాగు భూమికి రక్షణ ఉండదని తెలిపారు. ఈ చట్టాల వల్ల రైతులు పండించిన పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని, ఎంత పంటైనా నిలువఉంచుకోవని చెప్పడం ఇది చిన్న కమతాలు కలిగిన రైతులకు సాధ్యమేనా అని విమర్శించారు. బహుళ జాతి కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు ఆహార రంగాన్ని గుప్పిట్లోకి తెస్తూ, దేశ ప్రజల్ని మరింతగా బానిసత్వంలోకి నెట్టేందుకే ప్రయత్నం చేస్తున్నాయని తెలిపారు. ఈ చట్టాల వల్ల కౌలు రైతులు, పాలకు తీసుకున్న వారు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. సాగు చట్టాల అమలుపై విధించిన స్టేను స్వాగతించిన రైతునేతలు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీపై మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. ఆ సభ్యులను నమ్మలేమని వ్యవసాయ చట్టాలు రైతులకు ప్రయోజకరమని ఇన్నాళ్లు వారు అన్నారని అందుకే వారిని నమ్మలేమని తెలిపారని అన్నారు. కోర్టు చర్యల వెనుక కేంద్ర ప్రభుత్వం హస్తముందని ఆరోపించారు. రైతుల ఆందోళనల నుంచి ఈ విధంగా ప్రజల దృష్టి మళ్లించడానికే ప్రభుత్వం ప్రయత్నిస్తోదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేసిన 3 రైతు వ్యతిరేఖ వ్యవసాయ చట్టాలను రద్దు చెయ్యాలని లేదంటే భవిష్యత్ పోరాటాలకు ప్రభుత్వమే భాద్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు రాష్ట్ర సహాయ కార్యదర్శి M.శోభన్ నాయక్, రైతు సంఘం జిల్లా భాద్యులు రామావత్ మీట్యానాయక్, citu జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బోట్ల శ్రీనివాస్, రాపర్తి రాజు, ఐద్వా జిల్లా కార్యదర్శి ఇర్రి అహల్య, వృత్తి సంఘాల జిల్లా కన్వీనర్ బూడిది గోపి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పోత్కనూరి ఉపేందర్, మత్స్యకార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పంపర మల్లేశం, kvps జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తూడి దేవదానం, బోట్ల శేఖర్, citu పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్, nprd జిల్లా కార్యదర్శి బిట్ల గణేష్, kgks జిల్లా కార్యదర్శి బాల్దె వెంకటమల్లయ్య, ఆవాజ్ నాయకులు Md.దస్తగిరి, Md.అజారోద్దిన్, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందు, నాయక్, dyfi జిల్లా నాయకులు బోట్ల శ్రావణ్, రైతు సంఘం పట్టణ కార్యదర్శి మంగ బీరయ్య, ఐద్వా జిల్లా నాయకులు పల్లెర్ల లలిత, పందిళ్ల కల్యాణి. నాయకులు b.ప్రశాంత్, d.నాగరాజు, md. బుర్రానోద్దీన్, u.వేణు, కళ్యాణ్, md.మునీర్, బ్లేసింగ్టన్, g.శివ, k.కుమార్, సురేష్, ch.ఉపేందర్ d.శేఖర్, m.నర్సింహా, k.లింగం, యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.

50% LikesVS
50% Dislikes

By E69NEWS

Leave a Reply

Your email address will not be published.